Samantha:సమంత (Samantha Ruth Prabhu) గత కొన్నేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఈ మధ్యకాలంలో ఓ సినిమా తీయడమే కాదు.. ఆ సినిమాను సరైన విధానంలో ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. యశోదా సినిమా ప్రమోషన్‌లో నేను పాల్గొనాలి. కానీ అప్పటికే మయాసిటీస్ నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో గత్యంతరం లేక తనకు ఉన్న వింత వ్యాధిని అభిమానులకు చెప్పాల్సి వచ్చిందన్నారు సమంత. ఇక సమంత ఇపుడిపుడే మయాసిటీస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. గతేడాది సమంతకు వెరీ బ్యాడ్‌గా గడించిందనే చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ. 10 కోట్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత విజయ దేవరకొండతో చేసిన 'ఖుషీ' మూవీకూడా సమంతకు ఖుషీ ఇవ్వలేదు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో జీవించింది. మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. మాయాసిటీస్ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంది.
దీంతో గోడకు కొట్టిన బంతిలా ఇపుడు తన ఫిట్నెస్ ఫ్రీక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక మయాసిటీస్ బయటపడడానికి సమంత కొన్నేళ్ల పాటు చక్కెర, ఉప్పు, ఇతర ఆహార ధాన్యాలు ఏవి లేకుండా గడిపింది. ఇది అత్యంత బాధకరమైన విషయం అంటూ చెప్పుకొచ్చింది. సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి జీవితాలను వారు లీడ్ చేస్తున్నారు. ఎవరి సినిమాలు వాళ్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి