Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. జార్ఘండ్ నుంచి కోస్తా, ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రెండ్రోజులపాటు ఐఎండీ రాష్ట్రంలో అలర్ట్ జారీ చేసింది.
రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నిన్న ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకూ విస్తరించిన ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ కర్ణాటక నుంచి పశ్చిమ విదర్బ వరకూ ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంద్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనుంటే..అటు రాయలసీమలో మాత్రం తీవ్ర ఉక్కపోత, ఎండల వేడిమి ఉంటుంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, అరకు, అనకాపల్లి జిల్లాల్లో పొలాలు, మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
Also read: AP Summer Holidays: విద్యార్ధులకు శుభవార్త, ఈసారి ముందస్తు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook