Brother Sister Crying Video viral; ''అన్నా-చెల్లెలా అనుబంధం జన్మజన్మల సంబంధం'' అన్నాడు ఓ సినీ కవి. ప్రపంచంలోని అన్ని బంధాల కంటే సోదర-సోదరీమణుల మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకమైనది. చెల్లికి జీవితంలో ఏ కష్టం వచ్చినా అన్న అండగా నిలుస్తాడు. తండ్రి తర్వాత తండ్రిలా ఆమెను సాకుతాడు. తన సొదరిని రెండో తల్లిగా భావిస్తాడు. ముందు చెల్లి పెళ్లి చేసిన తర్వాతే అతడు వివాహం చేసుకుంటాడు. ఆమెతో గొడవలు పడతాడు, ప్రేమను పంచుతాడు, ఆపద వస్తే ఆదుకుంటాడు. చెల్లి కూడా అంతే ప్రేమను తన అన్నపై చూపిస్తుంది. వీరి బంధానికి గుర్తుగానే ప్రతి ఏటా రాఖీ పండుగను జరుపుకుంటారు.
పెళ్లికి ముందు అన్నా-చెల్లెల మధ్య ఉండే అనుబంధమే వేరు. సృష్టిలో భార్యభర్తలు, అన్నదమ్ములు విడిపోతారేమో కానీ అన్నా చెల్లెలు మాత్రం విడిపోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇంతకాలం కళ్లెదుటే తిరిగిన తన చెల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళిపోతే ఆ అన్న బాధను వర్ణించడానికి మాటలు చాలవు. తాజాగా ఇలాంటి ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ సోదరుడు తన చెల్లి పెళ్లిని వైభవంగా జరిపిస్తాడు. ఇంత కాలం కలిసి ఉన్న చెల్లి ఒక్కసారిగా వేరే ఇంటికి వెళ్లిపోతుందనే బాధలో ఆ అన్న వెక్కి వెక్కి ఏడ్చాడు. తన బావ గారి కాళ్లు పట్టుకుని మరి బోరున విలపించాడు. ఆయన కూడా తన బావమరిదిని అంతే ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ఓదార్చాడు. సోదరుడు ఏడవడం చూసి.. చెల్లి కూడా కన్నీళ్లును ఆపుకోలేకపోయింది. ఈ అన్నా-చెల్లెలా ఎమోషనల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో @Gulzar_sahab అనే ఖాతాతో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోను చూసినవారందరూ పుల్ ఎమోషనల్ అవుతారు. అంతేకాకుండాఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 'అన్న, చెల్లెలు ఒకరితో ఒకరు గొడవపడినా.. సోదరి పెళ్లి సమయంలో ఎక్కువగా ఏడ్చేది అన్నదమ్ములే' అని ఒకరు కామెంట్ చేస్తే.. సోదరుడి నిస్వార్థ ప్రేమకు ఈ వీడియో నిదర్శమని మరోకరు రాశారు. కేవలం 40 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్ లో దుమ్మురేపుతోంది.
भाई बहन आपस कितना भी झगड़ ले
पर बहन की शादी के वक़्त भाई ही सब से ज़्यादा रोता होता है 😭❤️ pic.twitter.com/vyD9mSgULf— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) March 16, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter