NBK -Legend Movie Re Release: ఒకప్పుడు తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా ఉండేది. అప్పట్లో శాటిలైట్, డిజిటల్ వంటి ఉండేవి. ఏదైనా సినిమాను తొలిసారి విడుదలైపుడు థియేటర్స్‌లో చూడకపోతే.. రీ రిలీజ్లో చూసేవారు. కానీ రాను రాను టెక్నాలజీ పెరగడంతో ఈ రీ రిలీజ్లు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఈ మధ్యకాలంలో పాత సూపర్ హిట్ సినిమాలను 4K టెక్నాలజీలో రీ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లెజెండ్ మూవీని పదేళ్లు పూర్తి కావొస్తోన్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2014 ఎలక్షన్స్ ముందు విడుదలైన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఓ తురుపు ముక్కలా పనిచేసింది.
లెజెండ్ మూవీ విషయానికొస్తే.. 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సింహా (Simha)తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ.. ఆ తర్వాత సరైన సక్సెస్ రావడానికి చాలా కాలమే పట్టింది. 2010 నుంచి 2014 మధ్య బాలకృష్ణ చేసిన సినిమాలన్ని దారుణ ఫలితాలను అందుకున్నాయి. ఇక పరమవీరచక్ర, అధినాయకుడు వంటి సినిమాలకు కనీసం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదంటే బాలయ్య మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. అటు శ్రీమన్నారాయణ కూడా డిజాస్టర్ అయింది. అలాంటి సమయంలో మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'లెజెండ్' మూవీతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఈ సినిమా 2014 మార్చి 28న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు బాలయ్య కెరీర్లో తొలి రూ. 40 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు సీనియర్ హీరోల్లో సోలోగా ఈ ఫీట్ అందుకున్న తొలి హీరోగా రికార్డులకు ఎక్కాడు బాలకృష్ణ. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన పొలిటికల్ డైలాగులు థియేటర్స్‌లో పేలాయి. ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ'తో మరో విజయం అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 80 కోట్ల షేర్ అందుకుంది.
ఈ సినిమా విడుదలై 10 యేళ్లు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో ఈ సినిమాను మళ్లీ గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా
యూట్యూబ్ తో పాటు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది వీక్షించారు. రీ రిలీజ్‌లలో చాలా సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మానేసారు. అలాంటి టైమ్‌లో 'లెజెండ్' మూవీని ఈ ఎన్నికల టైమ్‌లో పనిగట్టుకొని వచ్చి థియేటర్లో చూసి ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: పరగడుపున తులసి నీరు తాగితే ఈ సమస్యలు అన్ని పరార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter