Financiar Brutally Attacks On Man On Nonpayment Of Debt Rupees 5000: కొందరు తమ సంపాదన చాలకపోవడంతో అప్పులు చేస్తుంటారు. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లదగ్గర కొందరు అప్పులు చేస్తుంటే, మరికొందరు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తుంటారు. కొందరు వడ్డీ వ్యాపారులు వడ్డీల మీద వడ్డీలు వేసి పీడించుకుని తింటారు. ఇక.. సమయానికి తీసుకున్న అప్పులు చెల్లించకుంటే కొందరు ఇంట్లోకి వచ్చి నానారచ్చ చేస్తుంటారు. నోటికొచ్చినట్లు బండబూతులు తిడుతూ, హాత్య చేయడానికి సైతం వెనుకాడరు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఒక సైకో వడ్డీవ్యాపారి దారుణాలు ఇవి..
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దా
అప్పుకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తిని చితకబాది అదంతా కొడుకుతో వీడియో తీయించుకున్నాడు వడ్డీ వ్యాపారి రవి..ఐదువేల రూపాయలు అప్పు విషయంలో బాలయ్య అనే వ్యక్తిని ఇంత దారుణంగా కొట్టాడు pic.twitter.com/bZ4A9XtqNj— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) March 24, 2024
పూర్తి వివరాలు..
వికారాబాద్ లోని తాండురులో సైకో వడ్డీ వ్యాపారీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య అనే వ్యక్తి రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉంటున్నాడు. ఇతగాడు..రోజు తాండురూ కు నీటి సరఫరా చేస్తుంటాడు. ఈక్రమంలో అవసరమై.. నెల రోజుల క్రితం వడ్డీ వ్యాపారీ రవికుమార్ దగ్గర నుంచి అప్పుగా ఐదువేలు తీసుకున్నాడు. అప్పుకు సరిగ్గా ఇంట్రెస్ట్ కూడా చెల్లించకపోవడం, తప్పించుకుని తిరుగుతున్నాడని రవికుమార్, బాలయ్య మీద కోపం పెంచుకున్నాడు. అంతేకాకుండా.. రవికుమార్ బాలయ్యను తన ఇంటికి పిలిపించుకున్నాడు.
ఇక పొట్టలో, ఇష్టమున్నట్లు పంచ్ లతో విరుచుకుపడ్డాడు. నానా బూతులు తిడుతూ ఇష్టమున్నట్లు కొట్టాడు. బాలయ్య కొట్టొద్దని వేడుకున్న కూడా సైకో వడ్డీ వ్యాపారి మాత్రం కనికరించలేదు. అంతటితో ఆగకుండా.. ఈ ఘనకార్యాన్ని రవికుమార్ తన కొడుకుతోనే వీడియో కూడా తీయించి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..
ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టలో ఇష్టమున్నట్లు కొడితే... బాధితుడు చచ్చిపోతే ఎవరు దిక్కని కూడా నిలదీస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిని కఠినంగా కూడా శిక్షించాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook