Chennai Super Kings Vs Gujarat Titans Dream11 Team Tips: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఇద్దరు యువ సారథుల మధ్య బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడున్నాయి. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి జోరు మీదున్నాయి. తొలి మ్యాచ్‌లో బెంగళూరును చెన్నై ఓడించగా.. ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ చిత్తు చేసింది. సొంతగడ్డపై చెన్నైను ఓడించడం గుజరాత్‌కు సవాల్‌గా మారనుంది. చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. చెన్నై పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
Also Read: RCB Vs PBKS: విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి తొలి విజయం.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఓటమి
చెన్నై పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపుతాయి. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని చెన్నై చేతిలో ఓటమిపాలైంది. సీఎస్‌కే 175 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఫినిష్ చేసింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు సహకారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. పవర్ ప్లే ఓవర్లలో బ్యాట్స్‌మెన్ పరుగులు పిండుకునే అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. గుజరాత్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. చెన్నై రెండింటిలో విజయం సాధించింది. JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర , అజింక్యా రహానే , డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, సాయి కిషోర్, జాన్సన్
CSK Vs GT Dream11 Prediction Today:
వికెట్ కీపర్: వృద్ధిమాన్ సాహా
బ్యాట్స్‌మెన్: రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), రచిన్ రవీంద్ర (కెప్టెన్), సాయి సుదర్శన్
ఆల్‌రౌండర్లు: ఒమర్జాయ్, రవీంద్ర జడేజా
బౌలర్లు: దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్.
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter