Green Banana Health Benefits: పచ్చిఅరటికాయ 5 ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటూనే ఉంటారు..

Green Banana Health Benefits: అరటిపండు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఒబేసిటీతో బాధపడేవారు పచ్చి అరటికాయ కూర తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. పచ్చి అరటికాయ తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా స్థిరంగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 29, 2024, 06:51 PM IST
Green Banana Health Benefits: పచ్చిఅరటికాయ 5 ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటూనే ఉంటారు..

Green Banana Health Benefits: అరటిపండు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఒబేసిటీతో బాధపడేవారు పచ్చి అరటికాయ కూర తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. పచ్చి అరటికాయ తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా స్థిరంగా ఉంటుంది. అంతేకాదు దంతాక్షయం, నోటి పుండ్లు ,పిప్పి పన్ను రాకుండా కాపాడుతుంది. ఈ అరటికాయ తినడం వల్ల ఎముక ఆరోగ్యం బాగుంటుంది. దీంతో మెడ,నడుము నొప్పి వంటి సమస్యలు దరిచేరవు. ఈ అరటికాయ శరీరంలో వైరస్లు, బ్యాక్టిరియా రాకుండా నిరోధిస్తుంది. పచ్చి అరటికాయ కడుపులో యాసిడిటీ, కడుపునొప్పి, అజీర్తి, పుల్లటి తెన్పులు వంటి సమస్యలను అధిగమిస్తుంది. ముఖ్యంగా భయంకరమైన ఫైల్ సమస్యల నుంచి కూడా అరటికాయ రక్షిస్తుంది.ఇక ఈరోజుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వారికి కూడా పచ్చి అరటికాయ బెస్ట్ రెమెడీ ఈ అరటికాయతో చేసిన పులుసు తినడం వల్ల గాఢ నిద్ర పడుతుంది.

ఇదీ చదవండి: ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..! ఏం చేయాలంటే..?

మన శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పచ్చి అరటికాయ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల చుట్టూ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పచ్చి అరటికాయ మూత్రపిండంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు ఒకవేళ  మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడే వారికి రాళ్ళను బయటకు పంపిస్తుంది. ఈ పండు తింటూ దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు రాకుండా బతకవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పచ్చి అరటికాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సాధారణంగా అరటికాయలు అరటికాయ బజ్జీలు అరటికాయ ఫ్రై చేసుకుని తింటారు. కానీ ఈసారి మీరు అధిక ప్రయోజనాలు పొందడానికి పులుసు చేసుకుని తినండి. ఎల్లో బనానా మాదిరిగానే పచ్చి అరటికాయలు కూడా తింటే ఎనర్జిటిక్ గా ఉంటారు.

ఇదీ చదవండి: మహిళలు ఈ పండు తింటే చాలు.. వారికి UTI సమస్య దరిచేరదు..

 పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కడుపులో వ్యర్ధాలను బయటికి తరుగుతుందిగ్రీన్ బనానా లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా దరిచేరదు. పచ్చి అరటికాయలు ఉండే ఫైబర్ శరీరంలో శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా ఇన్సులిన్ నిర్వహిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అరటికాయలో విటమిన్ బీ6, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులోని మెగ్నిషియం, క్యాల్షియం వల్ల ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది కీళ్ల వ్యాధులు రాకుండా నివారిస్తుంది. 
షుగర్ వ్యాధి ఉన్నవారు పచ్చి అరటికాయ కూర తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులోనే ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News