AP Summer Updates: పెరుగుతున్న ఎండలు, తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక జారీ

AP Summer Updates: వేసవి కాలం ప్రారంభమైపోయింది. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2024, 12:29 PM IST
AP Summer Updates: పెరుగుతున్న ఎండలు, తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక జారీ

Temperature News in Telugu: ఏపీలో ఓ వైపు ఎన్నికలు మరోవైపు వేసవి తీవ్రత రెండూ హీటెక్కిస్తున్నాయి. నెలరోజుల ముందే ఎండల తీవ్రత పీక్స్‌కు చేరుతోంది. సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏప్రిల్ మొదటి వారం ప్రారంభం కాకుండానే పగటి ఉష్ణోగ్రత 39-42 డిగ్రీలు నమోదవుతుండటం గమనార్హం.

Also Read: Pregnant Woman Tips: సమ్మర్ లో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..

ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో అంటే ఏప్రిల్ మొదటి వారంలో 34-39 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రత 39-42 డిగ్రీలు ఉంటోంది. అంటే సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఎండలు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 4-43 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. అటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 40-44 డిగ్రీలు ఉండవచ్చని ఐఎండీ హెచ్చరించింది. 

ఎండలకు తోడు వడగాల్పులు వీయనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పల్నాడు, ప్రకాశం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40-41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదుకానుంది. దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రలో కూడా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఇప్పటికే తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, కడప జడిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా. 

వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగుతూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోమని చెబుతున్నారు.

Also read: Anaparti Effect: అనపర్తి కూటమి కొంపముంచనుందా, వైసీపీ నెత్తిన పాలు పోసిన పొత్తు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News