Contonement By-elections 2024 Candidate Declared: కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థి పేరును ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్‌కు టిక్కెట్ లభించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో కీలకమలుపులు చోటుచేసుకుంటూ అంచనాలకు అందకుండా ఉన్నాయి. కానీ, ఈ సీటను ఆశించిన అద్దంకి దయాకర్‌కు మాత్రమ కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపించింది. దీంతో అద్దంకి దయాకర్‌కు ఇది బిగ్ షాక్. అంతేకాదు గత ఎన్నికల్లో పోటీ చేసిన దివంగత గద్దర్ కూతురు వెన్నెలకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపించింది. అనూహ్యంగా గత అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీగణేష్‌కు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించింది. గత ఎన్నికల్లో దాదాపు 40 వేలకు పైగా ఓట్లు వచ్చి రెండో స్థానంలో నిలిచారు శ్రీగణేష్. ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. కానీ, అది నిజంగానే మారింది శ్రీగణేష్ కాంగ్రెస్ లో చేరిన వెంటనే టిక్కెట్ లభించింది.
ఇదీ చదవండి: 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్
గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన శ్రీగణేష్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఆ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్మె సాయన్న కూతురు దివంగత లాస్య నందిత బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలె ఆమె రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈనేపథ్యంలో సికింద్రాబార్ కంటోన్మెంట్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: నేడే తుక్కుగూడ జనజాతర సభ.. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిక?
అద్దంకి దయాకర్‌కు మళ్లీ మొండిచేయి..
ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్‌కు ఇది మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్. గతంలో తుంగతుర్తి టిక్కెట్‌ను కూడా ఆశించారు. అప్పుడు కూడా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా ఆశించారు అదీ జరగలేదు. ఈ సారైనా కంటోన్మెంట్ సీటు లభిస్తుందని ఎదురు చూశారు. ఇప్పుడు సరైన న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ, ఇప్పుడు కూడా అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపించి బిగ్‌షాక్ ఇచ్చింది. ఈనేపథ్యంలో కంటోన్మెంట్‌లో ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలారోజుల తర్వాత ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు త్వరలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ స్థానం నుంచి టిక్కెట్ దివంగత లాస్యనందిత కుంటుంబానికే దక్కుతుందని కూడా అనుకున్నారు. ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని అనుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook