Creamy Malai Chicken Recipe: సండే వచ్చిందంటే చాలు ఎవరి ఇంట్లో చూసినా చికెన్ గుమగుమలాడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వారింట్లోనైతే చెప్పనక్కర్లేదు ప్రతి సండే చికెన్ కావాలని పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అందులో వారు అప్పుడప్పుడు కొత్త కొత్త వెరైటీస్ కూడా అడుగుతూ ఉంటారు. నిజానికి చాలామంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ రెసిపీలో మలై చికెన్ ఒకటి.. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా ఇది రొమాల్ రోటి విత్ ఈ చికెన్ రెసిపీ కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క రెస్టారెంట్లో ఈ కాంబినేషన్ ఉండాల్సిందే.
మలై చికెన్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా పిల్లలకైతే ఇది కండరాలను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. చికెన్ లో అధికంగా పోషకాలు లభిస్తాయి. కాబట్టి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా అప్పుడప్పుడు పిల్లలకు ఈ మలై చికెన్ రెసిపీని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఈ మలై చికెన్ తయారీ విధానం తెలియకపోవడం కారణంగా రెస్టారెంట్లలో నుంచి ఆర్డర్ చేస్తున్నారు. నిజానికి ఇలా ఆర్డర్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి బదులుగా ఇంట్లోనే మేము అందించే సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి.
స్పెషల్ మలై చికెన్ రెసిపీ:
కావలసిన పదార్థాలు:
1 కిలో చికెన్ (బోన్‌లెస్, స్కిన్‌లెస్)
1/2 కప్పు పెరుగు
1/4 కప్పు క్రీమ్
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ మిరప పొడి
1 టీస్పూన్ గరం మసాలా
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
1/4 టీస్పూన్ కారం
1/4 టీస్పూన్ ఉప్పు
2 టేబుల్ స్పూన్ల నూనె
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ ఆవాలు
1 చిన్న ఉల్లిపాయ, తరిగిన
1 టమాటో, తరిగిన
1/4 కప్పు కొత్తిమీర, తరిగిన
తయారీ విధానం:
ఈ మలై చికెన్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది అందులో కెన్, పెరుగు, క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా కలిపి మాంసం మునిగేలా మసాలా పట్టించాల్సి ఉంటుంది. ఇలా మసాలా పట్టించిన మొక్కలను దాదాపు 30 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేది చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత ఇలా మరుగుతున్న కూరలోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని అవి మెత్తబడేంతవరకు ఉడికించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత టమాటాలు మెత్తబడ్డ తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ ను వేసి బాగా కలపాలిసి ఉంటుంది.
ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులోని తగినంత క్రీమ్ వేసుకొని మరో 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.
ఆ తర్వాత తగినంత కొత్తిమీరను పైనుంచి గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సార్లు చేసుకొని తింటే అచ్చం రెస్టారెంట్ లో లభించే మలై చికెన్ రెసిపీ టేస్ట్ పొందడం ఖాయం
చిట్కాలు:
ఈ చికెన్ కర్రీ మరింత టేస్టీగా ఉండడానికి మాంసాన్ని కలిపి పక్కన పెట్టే క్రమంలో మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల తాజా క్రీమ్ అదనంగా వేసుకోవచ్చు.
అలాగే కారాన్ని ఎక్కువగా తినేవారు మరో టీ స్పూన్ చిల్లీ పౌడర్ ను యాడ్ చేసుకోవచ్చు.
కూర మరింత రుచిగా పొందడానికి దీనిని తయారు చేసే క్రమంలో నూనెకు బదులుగా నెయ్యిని కూడా వినియోగించవచ్చు.
ఈ కూరను వండుకునే క్రమంలో చిక్కటి గడ్డలు కలిగిన పెరుగును వినియోగించడం వల్ల రుచి మరింత పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి