బెంగాల్ పర్యటన సక్సెక్ ; బాబు ప్రతిపాదనకు ఓకే చెప్పిన బెనర్జీ

               

Last Updated : Nov 19, 2018, 08:28 PM IST
బెంగాల్ పర్యటన సక్సెక్ ; బాబు ప్రతిపాదనకు ఓకే చెప్పిన బెనర్జీ

కోల్‌కతా: బెంగాల్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి మమత బెనర్టీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే బీజేపీయేతర కూటమిపై ఇరువురి మధ్య సుధీర్ఘ చర్చజరిగింది.  ఈ సందర్భంగా బీజేపీని ఓడించే ప్రణాళికను చంద్రబాబు మమతకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మమత..ఐక్యంగా ముందుకు వెళ్దామని చంద్రబాబుతో పేర్కొన్నారు. 

 బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపై తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మమతతో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసినడుద్దామని చంద్రబాబు కోరుగా..దీనికి మమత సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు మమత అంతగా ఆసక్తి చూపించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మమత ముందు చంద్రబాబు ఈ ప్రతిపాదన పెట్టారు. దీనికి మమత ఓకే అనడంతో ప్రతిపక్షాల ఐక్యత విషయంలో ఓ అడుగు ముందుకు పడినట్లయింది. 

సమావేశం అనంతరం చంద్రబాబు, మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యంలో రక్షించడమే తమ లక్ష్మమన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలోని అన్ని వ్యవస్థ భ్రష్టుపట్టాయన్నారు. పెట్రో ధరలు వీపరీతంగా పెరిగిపోయాయని..నోట్ల రద్దు పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే ద్రవ్యోల్భణం దారుణంగా పతనమైందని.. సీబీఐ, ఆర్బీఐ, ప్రణాళిక సంఘంగ సహా అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని... ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.  ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ సీబీఐ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైందనేని సమర్ధించారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో చంద్రబాబుతో కలిసి పనిచేస్తామని ఈ సంరద్భంగా మమత పేర్కొన్నారు.
 

Trending News