Gulab Jal Benefits: రోజ్ వాటర్ ను తరతరాలుగా సౌందర్య ఉత్పత్తిలో వాడుతున్నారు ఇందులో మంచి ఆరోమా ఉంటుంది. గులాబీ రేకులతో రోజ్ వాటర్ తయారు చేస్తారు. ఇది అన్ని రకాల స్కిన్ టోన్ ఉన్నవాళ్ళకి మంచిది రోజ్ వాటర్ తో మీ ముఖం మెరుపు వస్తుంది. ముఖం రెట్టింపు రంగు వస్తుంది.
హైడ్రేటింగ్ టోనర్..
రోజ్ వాటర్ మంచి హైడ్రోటింగ్ టోన్ గా పని చేస్తుంది దీని తరతరాలుగా సౌందర్య ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నారు ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది మన చర్మానికి పునరజ్జీవనం ఇస్తుంది. ఇది అన్ని స్కిన్ టోన్స్ కి మంచిది. చర్మం పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. కాటన్ ప్యాడ్ తీసుకొని రోజ్ వాటర్ తో ముఖానికి అప్లై చేసుకోవాలి. దీంతో మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా మారుతుంది.
ఇదీ చదవండి: సౌత్ ఇండియన్ స్టైల్ ఎగ్ కర్రీ.. రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..
ఫేస్ మాస్క్..
రోజ్ వాటర్ తో ఫేస్ మాస్ కూడా వేసుకోవచ్చు ఇది ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది చర్మానికి పునరుజీవనం ఇస్తుంది.ముఖం వాపు సమస్యను తగ్గిస్తుంది మీ ముఖానికి మంచి గ్లో ఇస్తుంది. కాటన్ ప్యాడ్ తో రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ మాస్క్ వేసుకుని పడుకోవాలి. ఉదయం మీ ముఖం తాజాదనం సంతరించుకుంటుంది.
కలబంద..
రోజ్ వాటర్, కలబంద, తేనె వేసి మంచి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ కి ఇది మంచి మందు ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద ముఖానికి మాయిశ్చర్ నిలుపుతుంది. రోజ్ వాటర్ మీ రంగును మెరుగుచేస్తుంది.
ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టే కరివేపాకు ఆయిల్ ఇలా తయారు చేసుకోండి
అరోమా థెరపీ..
రోజ్ వాటర్ లో ఏం చేసే గుణాలు ఉంటాయి ఇందులోని ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇస్తుంది. ముఖంపై వాపు సమస్య రాకుండా, మాయిశ్చర్ ని నిలుపుతుంది
సన్ బర్న్..
రోజ్ వాటర్ సన్ బర్న్ సమస్యకు కూడా మంచి మందు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమస్యను తగ్గిస్తుంది కాటన్ పాడ్ తో రోజు ముఖానికి అప్లై చేసుకోవాలి లేదా స్ప్రే చేసుకుంటే మంచి గ్లో వస్తుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter