South Indianstyle Egg curry: డిన్నర్ కి ఏ ఫుడ్ తయారు చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎప్పుడూ ఒకే విధమైన కర్రీ చేసే విసిగిపోయారా? ఈసారి సౌత్ ఇండియన్ స్టైల్ ఎగ్ కర్రీ తయారు చేయండి ఇది చపాతీ అన్నం లోకి సూపర్ టేస్ట్ గా ఉంటుంది.
కావలసిన పదార్థాలు..
గుడ్లు- 6
ఉల్లిపాయలు- 2
టమాటాలు -2
పచ్చిమిర్చి -2
వెల్లుల్లి రెబ్బలు- 4
అల్లం ఒక ఇంచు
పసుపు 1/2TBSP
స్పూన్ కారం-1TBSP
ధనియాల పొడి -1TBSP
గరం మసాలా -1/2TBSP
ఉప్పు రుచికి సరిపడా
నెయ్యి లేదా ఆయిల్ -2TBSP
కరివేపాకు, కొత్తిమీర ఒకటి
ఇదీ చదవండి: బంగాళదుంప కూరను ఇలా చేశారంటే లొట్టలేసుకుని తింటారు..
తయారీ విధానం..
ముందుగా వెజిటేబుల్స్ అన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు ఉప్పు వేసి గుడ్లను ఉడికించుకోవాలి. ఆ తర్వాత గుడ్లను పెంకులు తీసి ఓ పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
ఇదీ చదవండి: ఇడ్లీ దోశలకు ఈ చట్నీ తయారు చేసుకోండి.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా వేసి నూనె పైకి తేలే వరకు వండుకోవాలి
ఆ తర్వాత ఇందులో మసాలాలు గుడ్లు వేసి నూనె వదిలేవరకు సన్నని మంటలపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వేస్తూ కూర కన్సిస్టెన్సీ ని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా పైనుంచి ఉప్పు మిరియాల పొడి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఇది అన్నానికి అప్పంలోకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి