Injected Watermelons Identified: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల తో పాటు పుచ్చకాయలు ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి రోడ్లపై సైతం రాసులుగా పోసి అమ్ముతూ ఉంటారు. సమ్మర్ లో పుచ్చకాయతో తయారుచేసిన సలాడ్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతంతో పాటు విటమిన్స్ మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఎండా కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. దీని కారణంగా చాలామంది వేసవికాలంలో ఎక్కువగా పుచ్చకాయలను కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లలో చాలామంది పుచ్చకాయలను విక్రయించేవారు త్వరగా క్యాష్ చేసుకోవడానికి తాజాగా ఉండేటట్లు కనిపించేలా ఇంజక్షన్ చేసి విక్రయిస్తున్నారు.
ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటినే తరచుగా తీసుకోవడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంజక్షన్స్ ఇచ్చిన పుచ్చకాయలను తినడం వల్ల ముందుగా మనుషుల జీర్ణక్రియ పై తీవ్ర ప్రభావం పడి ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుచ్చకాయను చూడగానే పై ఉపరితలంపై కాస్త తెలుపు రంగులో ఉండి పసుపు రంగు అక్కడక్కడ ఉంటుంది. ఇలా కనిపిస్తే, తప్పకుండా మీరు దానికి ఇంజక్షన్ ఇచ్చినట్లు గుర్తించవచ్చు. అలాగే కొన్నింటిపై పసుపు రంగులో పొడి కూడా కనిపిస్తుంది. ఇలా కనిపించే పొడినే కార్బైడ్ అంటారు. నిజానికి ఈ పొడిని వినియోగించడం వల్ల పుచ్చకాయలు తొందరగా పండ్లు పండుతాయి. అంతేకాకుండా చూడడానికి తాజాగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పుచ్చకాయపై భాగం మొత్తం ఆకుపచ్చ రంగులోకి కూడా మారుతుంది.
పుచ్చకాయ ఎగువ ఉపరితల భాగం పై పసుపు రంగులో ఉన్న పొడిని తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని పిల్లలకు ఇచ్చే ముందు ఉప్పు నీటితో శుభ్రం చేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలు కోయగానే సాధారణ ఎరుపు రంగు కంటే నాలుగు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తింటే నాలుక కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఉంటే పక్కా ఇంజక్షన్ చేసినట్లే అని చెప్పవచ్చు. ఇంజక్షన్ చేసిన కొన్ని పుచ్చకాయలపై రంద్రాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా వాటిపై తొందరగా పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి వేసవిలో బుచ్చకాయలను కొనుగోలు చేసేవారు ఇవి తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి