AP Heat Waves: ఏపీలో వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఓ వైపు తీవ్రమౌతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు వడగాలులు భయపెడుతున్నాయి. రోజూ సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో అటు వాతావరణ శాఖ ఇటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మొత్తం 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 130 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 22, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 4, కాకినాడ జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, ఏలూరులో 1 మండలంలో ఇవాళ తీవ్రమైన వడగాల్పులు వీయనున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలు, విజయనగరం జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 12, కాకినాడలో 16, కోనసీమలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరులో 13, కృష్ణా జిల్లాలో 7 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో 7, పల్నాడులో 4 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి.
రాష్ట్రంలో నిన్న అంటే సోమవారం అత్యధికంగా సాలూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3 డిగ్రీలు నమోదైంది. అనకాపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నేపధ్యంలో ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు సాధ్యమైనంతవరకూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ జ్యూస్, దోసకాయ జ్యూస్, మజ్జిగ, బార్లీ నీళ్లు నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా సేవించమని సూచిస్తున్నారు.
Also read: AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు
నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook