Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తనకు ఇంత ఇచ్చిన ప్రజల కోసం తన వంతు బాధ్యతగా బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌ను 90వ దశకం చివర్లో స్థాపించారు. ఈ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ప్రాణాపాయంలో ఎంతో మందికి తనవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే కదా. నటుడిగానే కాకుండా సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్న చిరంజీవి సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్లడ్ బ్యాంక్‌తో 100 సార్లు రక్త దానం చేసిన వ్యక్తిగా మహర్షి రాఘవ రికార్డులకు ఎక్కారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. మహర్షి రాఘవను ప్రత్యేకంగా సన్మానించారు.
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో చిరంజీవి అభిమానుల పాత్రను కొట్టిపారేయలేము. ఎంతో మంది మెగాభిమానులు.. తమ అభిమాన హీరో పుట్టినరోజు సహా వివిధ సందర్భాల్లో రక్త దానం చేస్తున్నారు. వారి అండదండలోతోనే ఈ బ్లడ్ బ్యాంక్ ఈ స్థాయిలో ఉందని చిరంజీవి ఎపుడు చెబుతూ ఉంటారు.
వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంకుకి బ్యాక్ బోన్‌గా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.
మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. తాజాగా మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్ప రికార్డు .100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.
అయితే అనుకోకుండా 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.
హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు .
ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సీఓఓ రమణస్వామి నాయుడు, మెడికల్ ఆపీసర్ డాక్టర్ అనూష ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం చేశారు. ఈ సందర్భంలో మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తితో కలిసి ఆపద్బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
మూడు నెలలకు ఓ సారి లెక్కన 100 సార్లు రక్తదానం చేయటం గొప్ప విషయమని చిరంజీవి కొనియాడారు. ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ మొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. మహర్షి రాఘవ.. చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్'లో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం.. వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే యేడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదీ చదవండి: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook