Soaked Ladies Finger Water: బెండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అని కూడా కొందరూ పిలుస్తారు. అయితే ఈ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్ లో నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయలు శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బెండకాయ నీళ్లు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అలాగే సీజన్ల్ వల్ల కలిగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ బెండకాయ మాత్రమే ఇందలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ బెండకాయ నీళ్లు తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వేసవిలో శరీరం నుంచి నీరు అధికంగా బయటకి పోతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య కలుగుతుంది. ఈ డిహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి బెండకాయ నీళ్లు ఎంతో ఉపయోగపడుతుంది. బెండకాయ నీరు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో సహాయపడుతుంది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
బెండకాయలోని పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా బెండకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలోని విటమిన్ ఎ జుట్టు ఆరోగ్యానికి మంచిది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
బెండకాయ నానబెట్టిన నీటిని ఎలా తయారు చేయాలి:
ముందుగా మీరు 2-3 బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కోసుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలను నానబెట్టండి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే, బెండకాయ ముక్కలను వడగట్టి, నీటిని తాగాలి. మీరు రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బరువు తగ్గడంలో కూడా ఈ నీరు ఎంతో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందారు.
గమనిక: మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే, బెండకాయ నానబెట్టిన నీటిని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook