Gwalior Girl Marries With Lord Krishna: కొందరు చిన్నతనం నుంచి దైవ భక్తిని ఎక్కువగా కల్గి ఉంటారు. తమకు తాముగా దేవుడికి అర్పించుకుంటారు. భగవత్ సేవలోనే తమ జీవితం అంతా గడిపేస్తామంటూ చెబుతుంటారు. మనం గ్రామాలలో దేవదాసీలను చూస్తుంటాం. వీరిని గ్రామాల్లో దేవుని పేరుమీద వదిలేస్తుంటారు. దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వీరు జీవితాంతం కూడా అస్సలు పరాయి వాళ్లను అస్సలు పట్టించుకొకుండా,జీవితమంతా ఆ దేవుడి సేవలోనే ఉంటారు. ముఖ్యంగా మార్వాడీ, గుజరాతీలలో ఎక్కువగా మనం అమ్మాయిలు కృష్ణుడి కోసం తమజీవితాలను అంకితం చేసుకున్న అనేక ఘటనలు చూశాం.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
అదేవిధంగా ప్రస్తుతం మరోక యువతి శ్రీ కృష్ణుడితో పెళ్లి చేసుకుంది. అచ్చం ఒక వరుడు ఉంటే ఏ విధంగా కార్యక్రమాలు ఉంటాయో.. అదే విధంగా యువతి పెళ్లి జరిగింది. గుడిలో వరుడిగా శ్రీ కృష్ణుడి విగ్రహాను అలంకరించారు. ఆ తర్వాత వేద మంత్రా మధ్య వైభవంగా పెళ్లి తంతు జరిపించారు.ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన శివానీ పరిహారకు కృష్ణుడంటే ఎంతో భక్తి. ఆమె చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధించేంది. దీంతో కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్నితన తల్లిదండ్రులను కూడా చెప్పింది. మరోకరిని మాత్రం పెళ్లి చేసుకోబోనని చెప్పి,ఒప్పించింది. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి కార్యక్రమం కూడా వేడుకగా జరిగింది. వివాహాం తర్వాత బాజా బజంత్రిల మధ్య అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఇక నుంచి శివానీ పరిహార కృష్ణుడి సేవలోనే ఉండనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఆలయంలో వేద మంత్రాల సాక్షిగా ఆమె కృష్ణుడిని వివాహం చేసుకుంది. ఇక వివాహం ముగిసిన తర్వాత శివానికి వివాహ ప్రమాణ పత్రం కూడా అధికారులు అందజేశారు. శివాని పట్టుదల కారణంగా ఆమె పెళ్లికి అంగీకరించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఇక శివాని తన పూర్తి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తూ గడపనుంది. ప్రస్తుతం యువతికి శ్రీ కృష్ణుడి పట్ల ఉన్న భక్తికి స్థానికులు ఆశ్యర్యపోతున్నారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం మంచి లైఫ్ ను ఎంజాయ్ చేయోచ్చు కదా.. ఇలాంటి వైరాగ్య భావనలు ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. శ్రీ కృష్ణుడి పట్ల ఆమె భక్తికి ఫిదా అవుతున్నారు. ఆమె పట్టుదల, కృష్ణుడి పట్ల ఆమెకున్న విశ్వాసం, ఇవన్ని చూసి షాక్ అవుతున్నారు. పెళ్లి వేడుక గ్రామం మధ్యలో ఆలయంలోజరిగింది. అచ్చం పెళ్లి సంప్రదాయమంతా జరిపారు.పెళ్లిలో మెహాందీ, డ్యాన్స్ బారత్, సంగీత్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక యువతి కూడా తను కృష్ణుడిని పెళ్లి చేసుకొవడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ముఖంలో ఏమాత్రం నిరాశ గానీ లేవు. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకొవడం పట్ల యువతి కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter