SSC Topper Trolling: టెన్త్ టాపర్ కు ఘోర అవమానం.. ముఖం బాలేదంటూ నీచంగా కామెంట్లు..

SSC Topper Trolling: ఇటీవల ఉత్తరప్రదేశ్ లో యువతి టెన్త్ లో టాప్ మార్కులు సాధించింది. సీతాపూర్‌కు చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. కొన్ని మీడియాలు ఆమె ఇంటర్వ్యూతీసుకున్నాయి. ఈక్రమంలో ఆమెను కొందరు ట్రోలింగ్ చేయడం నెట్టింట్లో తీవ్ర దుమారంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2024, 09:29 AM IST
  • రెచ్చిపోయిన మీమర్స్..
  • టెన్త్ విద్యార్థిపట్ల అసభ్యప్రవర్తన
SSC Topper Trolling: టెన్త్ టాపర్ కు ఘోర అవమానం.. ముఖం బాలేదంటూ నీచంగా కామెంట్లు..

Uttar Pradesh 10 Topper Prachi Nigam Gets Trolled Over Facial Hair: కొందరు ఎదుటి వాళ్ల పట్ల చులకనగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా.. కొందరు అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని ట్రోలింగ్ కు పాల్పడుతుంటారు. పొట్టిగా ఉందని, నల్లగా ఉందని, ముఖంపై మచ్చలు ఉన్నయని వేధిస్తుంటారు. ఆడపిల్లలు,మహిళలు ఎక్కువగా ట్రోలింగ్ కు గురౌతుంటారు. రాజకీయ నాయకుల నుంచి సినిమా నటుల వరకు ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ బారిన పడిన వాళ్లే. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఒక మీటింగ్ నేపథ్యంలో ట్రోలింగ్ కు గురైన విషయం తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లో అగ్రగామిగా, పురుషులతో సమానంగా రాణించాలని కూడా అనేక సందర్భరాలలో చెబుతుంటాయి. కానీ  కొందరు మాత్రం మహిళల మనస్సులు కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా బాడీ షేమింగ్ చేస్తు వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంటారు.

 

ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు కావాలని కొందరు మహిళలను టార్గెట్ గా చేసుకుంటారు.  మహిళల రంగు, దుస్తులపై కామెంట్లు చేస్తుంటారు. ఇలాంటివి ఇప్పటికే ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచినాయి. తాజాగా ఒక టెన్త్ టాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది.ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు.. 

ఉత్తర ప్రదేశ్‌ లో ఇటీవల ఎస్సెస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి.దీనిలో ఒక యువతి రాష్ట్రంలోనే టాప్ మార్కులు సాధించింది. ఆమె తనకు టాప్ వచ్చిన ఆనందం అందరితో పంచుకుంది. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ ఏప్రిల్ 20న 10వ, 12వ తరగతుల ఫలితాలను ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో.. సీతాపూర్‌కు చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ఆకట్టుకునే స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. సదరు యువతికి.. 98.50 శాతం, 600కు గాను 591 మార్కులు సంపాదించింది. దీంతో సదరు యువతి ఇంటర్వ్యూ తీసుకొవడానికి అనేక మీడియాలు పోటీపడ్డాయి. యువతి ఎగ్జామ్స్ లలో మంచి ఫలితాలు సాధించడానికి ఎంతో కష్టపడ్డానని, తనకు పాఠాలు చెప్పిన గురువులకు, నిరంతరం ప్రొత్సహించిన తన తల్లిదండ్రులకు కూడా తన ధన్యవాదాలు తెలిపింది. స్యూల్ యాజమాన్యానికి, ఫ్రెండ్స్ కు ప్రత్యేకంగా థైంక్స్ చెప్పింది.

భవిష్యత్తులో తనకు మంచి ఇంజనీర్ కావాలని ఆశయం ఉన్నట్లు తెలిపింది.అంతేకాకుండా.. ఇంకా కష్టపడి చదివి, నా తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకొస్తానంటూ చెప్పింది. కష్టపడితే ఏదైన సాధించవచ్చని, మిగతా విద్యార్థులలో స్పూర్తిని నింపింది. ఇదిలా ఉండగా ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. అయితే.. సదరు యువతి ప్రాచీ నిగమ్ కు ముఖంపై కొంత అవాంఛనీయ రోమాలు ఉన్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఆమెకు మీసాలున్నాయంటూ ఎగతాళిగా కామెంట్లు చేశారు. ప్రాచీ.. ఒక స్టేట్ లోనే టాప్ మార్కులు సాధించింది పక్కన బెట్టి.. ఆమె ముఖంపై ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో అదే సోషల్ మీడియాలో మరిందరు ఆమెకు సపోర్ట్ చేస్తు, ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ బతుకులు ఇంతే.. యువతి ఎంత కష్టపడింది.. ఆమె ఎలాంటి విజయం సాధించిందో అది చూడాలంటున్నారు. ఇలా దిగజారీ ట్రోలింగ్ చేయడానికి సిగ్గుగా లేదా.. అంటూ కొందరు ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతంవార్తలలో నిలిచింది.

Trending News