Road Accident In Surayapet Lorry And Car Colliddes: సూర్యాపేటలో ఈరోజు (గురువారం) తెల్లవారు జామున ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. హైవేమీద లారీని, కారు వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో, కారులో ఉన్న ఆరుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. కారులోని ప్రయాణికులు ఎగిరి బైటకు పడినట్లు సమాచారం. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. ఘటన జరిగినప్పుడు కారులు 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు గలకారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. హైవేను పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియర్ చేస్తున్నారు.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
మరోవైపు.. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలుసుకునేందుకు, పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు తెల్లవారుజామున సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. నిద్రమత్తులో వాహానం ను నడపడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, పోలీసుల చెప్తున్నారు. మరోవైపు కొందరు లారీ డ్రైవర్ లు కూడా తమ వాహనాలను రెడ్ లైట్ లు లేదా సైడ్ ఇండికేటర్ ఇవ్వకుండా రోడ్డుమీద ఇష్టమున్నట్లు పార్కింగ్ చేస్తుంటారు. వేగంగావ వెళ్లేవారు ఏమాత్రం అజాగ్రత్తగాఉన్న సెకనులో వ్యవధిలో ఘోర ప్రమాదాలు జరిగిపోతాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటనను చూసి రోడ్డుపైన వెళ్తున్న వారు కూడా తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పకట్భందీ చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు.మొత్తానికి ఈ ఘటన మాత్రం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకొవచ్చు.
Read More: Suryapet Road Accident: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆగి ఉన్న ట్రక్కు కిందకు చొచ్చుకుపోయిన కారు..
ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేటలోనే ఒక కొత్త యువజంట ఆగిఉన్న కంటైనర్ ను కూడా తెల్లవారుజామునే ఢీకొట్టారు. ఈ ఘటనలో కూడా ఇద్దరు స్పాట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘనలో కారుపూర్తిగా కంటైర్ కిందకు దూరిపోయింది. ఈ కారును తీయ్యడానికి పోలీసులు రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter