YS Jagan Assets: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తిపాస్తులు భారీగా పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో కొంత పెరిగాయి. జగన్ ఆస్తుల విలువ మొత్తం రూ.757.65 కోట్లు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ గురువారం తన నామినేషన్ సమర్పించారు. కొన్ని రోజుల కిందట మొదటి సెట్ సమర్పించగా.. తాజాగా రెండో సెట్ దాఖలు చేశారు.
నామినేషన్ సందర్భంగా వైఎస్ జగన్ అఫిడవిట్‌కు కూడా సమర్పించారు. అఫిడవిట్‌లో ఆస్తిపాస్తులతోపాటు క్రిమినల్ కేసులు కూడా వివరించారు. జగన్ ఆస్తుల విషయానికి 2019 ఎన్నికలకు తాజా ఎన్నికలకు భారీ తేడా ఉంది. ఐదేళ్లలో జగన్ ఆస్తి రూ.154 కోట్లు పెరిగింది. ఆస్తి లెక్కల్లో 41 శాతం పెరుగుదల ఉంది. జగన్ పేరుపై రూ.529 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.7 వేలు మాత్రమే ఉన్నాయి. అయితే కుటుంబంలో ఎవరి పేరుపై కూడా కారు లేదంట.
Also Read: Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..
భార్య భారతి, కుమార్తెల పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. భారతి పేరిట రూ.124 కోట్ల ఆస్తి ఉండగా.. ఇద్దరు కుమార్తెల పేరిట రూ.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బంగారం విషయానికి వస్తే భారతికి రూ.5.5 కోట్ల విలువ చేసే ఆరున్నర కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయి.
ఆస్తులు చూస్తే
జగన్‌కు ఇడుపులపాయలో 35 ఎకరాల భూమి ఉంది. ఇడుపులపాల, భాకరాపురం, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో జగన్‌కు స్థలాలు ఉన్నాయి. ఇక వ్యవసాయేతర భూముల విలువ రూ.46 కోట్లు ఉన్నాయి.
కేసుల వివరాలు
ఇక కేసుల విషయానికి వస్తే వైఎస్ జగన్‌పై మొత్తం 26 కేసులు ఉన్నాయి. వాటిలో 11 సీబీఐ కేసులు ఉండగా, 9 ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. పలు పోలీస్‌స్టేషన్‌లలో 6 కేసులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter