Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?

Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. దీంతో జియో యూజర్ ల ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2024, 09:02 PM IST
  • జియో యూజర్ లకు అనుకోని షాక్..
  • అకస్మాత్తుగా నిలిచిపోయిన నెట్ సేవలు..
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?

Reliance jio network services outage In India: రిలయన్స్ దిగ్గజం జియో సర్వీసులకు గురువారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో నెట్ వర్క్ ఒక్కసారిగా షట్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్ లు తమ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ల ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ సేవలు, ఎస్ఎంఎస్ సేవలు, ఇంటర్నేట్ సేవలు పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్ లు సోషల్ మీడియా, ఇన్ స్టా  వేదికలుగా మీ ఇంటర్నేట్ పనిచేస్తుందా..అంటూ కామెంట్లు పెట్టడం చేస్తున్నారు. 

రియల్ టైమ్ ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌ డిటెక్టర్ ప్రకారం, రిలయన్స్ జియో యొక్క నెట్‌వర్క్ సేవలు ముఖ్యంగా  భారతదేశంలో అనేక చోట్ల ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా..  ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ పూర్తిగా ఆగిపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా, సిగ్నల్ మిస్సింగ్ గురించి ప్రజలు నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా తమ వర్షన్ లను వినిపిస్తున్నారు. దీనిపై ఇంకా రిలయన్స్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

ఇదిలా ఉండగా అనేక సందర్బాలలో నెట్ వర్క్ లోని పలు సమస్యల వల్ల ట్విటర్ , ఇన్ స్టాల, వాట్సాప్ కూడా అనేక సందర్భాలలో మోరాయించిన ఘటనలుకూడా ఉన్నాయి. టెక్నికల్ సమస్యలు తలెత్తిన కొద్ది సేపట్లోనే తిరిగి టెక్నాలజీ టీమ్ రంగంలోకి నెట్ వర్క్ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇదిలా ఉండగా.. ప్రస్తతం జియోలో ఏర్పడిన సమస్యకూడా అలాంటిదేనంటూ కొందరు యూజర్లు భావిస్తున్నారు. కానీ ఒక్కసారిగా మెసెజ్ లు ,కాల్స్ పోకపోవడం, నెట్ వర్క్‌ పనిచేయకపోవడంతో యూజర్ లు ఒకింత ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా ప్రస్తుతం ఐటీరంగంకానీ, ఇతర అన్ని విషయాలు ఫోన్ లు, ఇంటర్నేట్ సేవల మీద ఆధారపడి పనిచేస్తుంటాయి. మనిషి జీవితంలో బతకడానికి గాలిపీల్చడం, తినడం, పడుకోవడంఎలాగో.. ప్రస్తుతం ఫోన్ లు, ఇంటర్నేట్ సేవలు కూడా అంతే ప్రధానంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇలాంటి అంతరాయం వల్ల కోట్లాదిరూపాయల బిజినెస్ ను తీవ్ర ఇబ్బందులు కల్గుతాయని యూజర్ లు ఆందోళన చెందుతుంటారు. అందుకే చాలా మంది ఒక నెట్ వర్క్ కాకుండా రెండు, మూడు సిమ్ లను ఉపయోగించుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా ఏ నెట్ వర్క్ లో సిగ్నల్ ఉంటుందో చూసుకుని దాన్ని ఉపయోగిస్తున్నారు. 

Read More: IPS Sneha Mehra: ఎన్నికల వేళ అసద్ కు మరో బిగ్ షాక్.. సౌత్ జోన్ డీసీపీగా లేడీ సింగం..

Read More: Tesla CEO Elon Musk: ఎలాన్ మస్క్ తో ప్రేమాయణం.. సౌత్ కొరియా మహిళకు దిమ్మతిరిగే షాక్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News