Bhopal techie gives triple talaq to wife in running train: ముస్లిం కుటుంబాలలో ట్రిపుల్ తలాక్ అనేది పెద్ద గుదిబండగా మారింది. వాళ్లు ఎప్పుడైన ఎలాంటి సందర్బంలో అయిన భార్యకు మూడు సార్లు.. తలాక్ తలాక్ తలాక్ అంటే వారు విడాకులు ఇచ్చేసినట్లు భావిస్తారు. దగ్గర ఉన్నా.. లేదా ఫోన్ లో కూడా ట్రిపుల్ తలాక్ చేస్తే షరియా చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చేసి, తమ దాంపత్య జీవితానికి ఎండ్ కార్డు వేసినట్లు భావిస్తారు. దీనికి అనేక మంద ముస్లిం కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అందుకే కేంద్రం ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తు చట్టం కూడా తీసుకొచ్చింది. అయిన కూడా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ట్రిపుల్ తలాఖ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రజల్లో అవగాహాన కల్పిస్తున్న కూడా ఇప్పటికి కొందరు ట్రిపుల్ తలాక్ నుఫాలో అవ్వడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఇక్కడ ఒక టెకీ తన భార్యకు రన్నింగ్ ట్రైన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పి, ఆమెపై దాడిచేసి పారిపోయాడు. ఈఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Read More: 25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన అర్షద్ కు, రాజస్థాన్‌లోని కోటకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాకు ఈ ఏడాది జనవరి 12న వేడుకగా పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత వీరి కొన్నిరోజులు కాపురం సజావుగానే సాగింది. కానీ ఆతర్వాత తరచుగా వీరి మధ్య మాత్రం అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు ఏర్పడుతు ఉండేవి. ఈ క్రమంలో వాగ్వాదాలు, గొడవలు పడటం మాత్రం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో.. అర్షద్ తన భార్య అఫ్సానా తోకలిసి పుఖ్రాయాన్ కు ట్రైన్ లో బయలుదేరాడు. ట్రైన్ ఝాన్సీ స్టేషన్‌లోకి ప్రవేశించింది. అప్పుడు ఇద్దరు ట్రైన్ లోనే గొడవలు పడ్డారు. వాగ్వాదం కూడా చేసుకున్నారు. అప్పుడు అర్షద్ ఒక్కసారిగా తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చేప్పెశాడు.
అంతేకాకుండా ఆమెతో గొడవ పడి ఆమెను ఇష్టమున్నట్లు కొట్టాడు. ట్రైన్ లో ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. చుట్టుపక్కల ఉన్న వారు ఆపేందుకు ప్రయత్నం చేసిన అతను వినలేదు. ఈ ఘటన ఏప్రిల్ 29 న జరిగినట్లు తెలుస్తోంది. ఝాన్సీ స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వీరికి పెళ్లి కుదిరినట్లు సమాచారం.
ఈ జంట గత వారం పుఖ్రాయన్‌లోని అర్షద్ బంధువుల ఇంటికి వెళ్తున్నప్పుడుఈ ఘటన జరిగింది. అయితే.. మరో ట్విస్ట్ ఏంటంటే.. అర్షద్‌కు అప్పటికే వివాహమైందని అఫ్సానాకు ఆతర్వాత తెలిసి ఆశ్చర్యపోయింది. అతన్ని ఎక్కడ నిలదీస్తుందో అతగాడు.. ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పారని, తనను కట్నం కోసం కూడా వేధించారని పోలీసులకు అఫ్సానా ఫిర్యాదు చేసింది. కాగా, అఫ్సానా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళలకు విడాకులు ఇచ్చి వారిని విడిచిపెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త అర్షద్, అతని మామ అకీల్, తండ్రి నఫీసుల్ హసన్, తల్లి పర్వీన్‌లపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) ప్రియా సింగ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter