క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై నాదెండ్ల భాస్కర్ రావు ఘాటుగా స్పందించారు. తన పాత్రలో తేడా వస్తే ఖబర్దార్ అంటూ నాదెండ్ల భాస్కర్ రావువ వార్నింగ్ ఇస్తున్నారు. ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో తనను విలన్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఉందని నాదెండ్ల ఆరోపిస్తున్నారు. అలా చేస్తే తాను కోర్టు మెట్లు ఎక్కుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు తనను సంప్రదించలేదని ..ఏం తెలుకోకుండా తన పాత్రను ఎలా చిత్రీకరిస్తారని నాదెండ్ల ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం తీసే సినిమాలో తనను విలన్ చూపిస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. తన పాత్రను నెగిటివ్ గా చూపిస్తే న్యాయస్థానానికి వెళ్లానని నాడెండ్ల భాస్కర్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డులకు నోటీసులు పంపినట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వెల్లడించారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రిలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వేర్వేరు కోణాల్లో సినిమాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ వస్తుండగా..క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన రీతిలో వారు వేర్వేరు వర్షన్స్ లో తీస్తున్న ఈ చిత్రాలపై వివాదాలు చోటు చేసుకున్నాయి. వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇటీవలె విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ లో చంద్రబాబును విలన్ చూపినట్లు ఉందని టీడీపీ నేతలు దీనిపై అభ్యంతరం తెలిపారు. ఇదే సందర్భంలో క్రిష్ తీస్తున్న సినిమాలో తనను విలన్ చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఈ మూవీపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు తాజా ఈ సినిమాలో తనను విలన్ గా తీస్తున్నారని ఎన్టీఆర్ కు తొలినాళ్లలో చేడోడువాడోదుగా నిలిచిన నాదెండ్ల భాస్కర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఈ బయోపిక్ వివాదం ఎంత వరకు దారితీస్తోందనేది చర్చనీయాంశంగా మారింది.