AP Assembly Lok Sabha Election Voting Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఓట్ల పండుగ జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4, 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఓటర్లు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షలు కాగా.. అందులో పురుషులు 2.3 కోట్లు, మహిళలు 2.10 కోట్లు ఉన్నారు. ఇక థర్డ్‌జెండర్ ఓట్లు 3,421 ఉన్నాయి. సర్వీస్ ఓటర్ల సంఖ్య 68,185గా ఉంది. మొత్తం 1.6 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.