Trivikram: యంగ్ హీరోతో ప్రేమ కథ.. త్రివిక్రమ్ ఆసక్తి చూపిస్తారా?

Ram Pothineni: త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాతో ఒక మోస్తారు విజయం సాధించిన.. ఈ దర్శకుడు తదుపరి ప్రాజెక్టుపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 18, 2024, 09:18 PM IST
Trivikram: యంగ్ హీరోతో ప్రేమ కథ.. త్రివిక్రమ్ ఆసక్తి చూపిస్తారా?

Trivikram-Ram: మాటల మాంత్రికుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. ఎందుకంటే ఆయన మాటలతోనే మాయ చేయగలరు. సినిమా కథ కన్నా కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మొదట్లో డైలాగ్ రైటర్ గా ఎన్నో సెన్సేషనల్ హిట్లు ఇచ్చిన ఈయన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. త్రివిక్రమ్ డైలాగ్స్ అందించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు అప్పట్లో సెన్సేషనల్ విజయాలు సాధించాయి. కానీ ఆ సినిమాలు అన్నిటికీ విజయభాస్కర్ దర్శకత్వం వహించారు.

ఫైనల్ గా స్రవంతి రవికిషోర్ ఇచ్చిన ఛాన్స్ తో.. త్రివిక్రమ్ సైతం దర్శకుడిగా మారిపోయారు. అందుకే త్రివిక్రమ్ కెరియర్ లో నువ్వే నువ్వే సినిమాకి అలానే ఆ చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవి కిషోర్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే నువ్వే నువ్వే చిత్రం తరువాత త్రివిక్రమ్ ఎప్పుడు స్రవంతి రవికిషోర్ తో మరో సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి స్రవంతి మూవీస్ తో సినిమా చేయనున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ త్వరలోనే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు చూసి.. మార్పులు చేర్పులు చేసి జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ వెంటనే త్రివిక్రమ్ సెట్లో అడుగు పెట్టే అవకాశం పెద్దగా కనిపివ్వడం లేదు. ఎందుకంటే పుష్పా రెండో భాగం అవ్వగానే అల్లు అర్జున్ అట్లీ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో అన్ని రోజులు ఖాళీగా ఉండటం ఎందుకని.. త్రివిక్రమ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో తన గత చిత్రం అఆ తరహాలో‌.. ఒక సింపుల్ ప్రేమ కథను తీసే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. కాగా త్రివిక్రమ్..హీరో రామ్ తో ఒక సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిశోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్ కు నువ్వే నువ్వే రూపంలో మొదటి అవకాశం ఇచ్చింది రవి కిషోర్ ఏ కాబట్టి..ఆ కృతజ్ఞత త్రివిక్రమ్ కి తప్పకుండా ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం త్రివిక్రమ్ కి గ్యాప్ ఉంది కాబట్టి స్రవంతి రవి కిషోర్ త్రివిక్రమ్ని రామ్ తో సినిమా చేయవలసిందిగా ఇచ్చారంట.

త్రివిక్రమ్ దగ్గర కథ పరంగా ఇబ్బంది లేదట. అయితే ఈమధ్య స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసి చేసి ఇప్పుడు టయర్ 2 హీరోలతో జట్టు కట్టడం గురించి మాత్రమే మన మాటల మాంత్రికుడు ఆలోచిస్తున్నట్టు ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. కాగా దీనిపై క్లారిటీ తెచ్చుకోవాలంటే త్రివిక్రమ్ స్పందించాలి. అడగాలన్నా కానీ ప్రస్తుతం ఈ దర్శకుడు ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు. పోనీ ఏదైనా ఈవెంట్ కి వస్తే అడుగుదామంటే ఆ ఛాన్స్ ఆయన మీది ఆకు ఇవ్వడం లేదు. మరి పూర్తిగా అల్లు అర్జున్ సినిమా మీదే దృష్టి పెడతారా లేక రామ్ తో సినిమా చేస్తారా తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Read more: TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News