Iran President killed: ఇరాన్ దేశంలో విషాధఛాయలు నెలకొన్నాయి. ఘోరమైన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్ ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 గంటల సెర్చ్ ఆపరేషన్ అనంతరం ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని ధృవీకరణైంది.
ఇరాన్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆయతుల్లా ఖొమైనీ తరువాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న దేశాద్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీరబ్దుల్లాహియాన్ హెలీకాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అజర్ బైజాన్-ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్టు క్విజ్ ఖలైసీ డ్యామ్ ప్రారంభించేందుకు అజర్ బైజాన్ వెళ్లి తిరిగొస్తున్న క్రమంలోఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలీకాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా 18 గంటలకు పైగా కొనసాగింది.
ఇరాన్ సెర్చ్ ఆపరేషన్‌లో సహాయపడుతున్న టర్కిష్ ద్రోన్ ఒకటి హెలీకాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాల్ని పంపించారు. టర్కిష్ ద్రోన్ గుర్తించిన ఆ ప్రాంతాన్ని తవాల్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నట్టుగా టర్కీకు చెందిన ఆ ద్రోన్ గుర్తించింది. చివరికి ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని ఇరాన్ మీడియా కూడా తెలిపింది. ఇరాన్ అధికారికంగా ఈ వార్తను ధృవీకరించాల్సి ఉంది.
Also read: Iran Helicopter Crash: హెలీకాప్టర్ ఎక్కడ కూలింది, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలతో ఉన్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook