Bharateeyudu 2: కమల్ హాసన్ 'భారతీయుడు 2' నుంచి 'శౌర' లిరికల్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్..

Bharateeyudu 2: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన చిత్రం 'భారతీయుడు 2'. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'శౌర' అంటూ విడుదల చేసిన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 23, 2024, 06:30 AM IST
Bharateeyudu 2: కమల్ హాసన్ 'భారతీయుడు 2' నుంచి 'శౌర' లిరికల్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్..

Bharateeyudu 2: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వస్తోన్న భారీ చిత్రం 'భారతీయుడు 2'.  అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో విడుదల చేస్తున్నారు. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'భారతీయుడు 2' టైటిల్‌తో..  హిందీలో 'హిందూస్థానీ 2'పేరుతో...తమిళంలో 'ఇండియన్ 2' పేరుతో విడుదల కాబోతుంది.

1996లో క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా  ‘భార‌తీయుడు 2’ తెరకెక్కించారు. దాదాపు 28 యేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం విశేషం. అప్పట్లో తొలి DTS మూవీగా భారతీయుడు రికార్డులకు ఎక్కింది.  అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచారు. అందులో భాగంగా  మేక‌ర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే భార‌తీయుడు 2 అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ పిక్చరైజ్ చేసినట్టు అర్ధమవుతోంది. భారతీయుడు సినిమాకు అప్పట్లో ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిచారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగులో ఈ పాటను సుద్ధాల అశోక్ తేజ రాసారు. ఈ సాంగ్‌ను  రితేష్ జి.రావ్‌, శ్రుతికా స‌ముద్రాల పాడారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తై ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించాయి.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌ సేనాపతి పాత్రలో మరోసారి కనిపించనున్నారు. ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,  ఎస్‌.జె.సూర్య‌,  నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు నటించారు.

ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News