Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూటమి సహాకారంతో అధికారంలోకి రాబోతుంది. కానీ ఉత్తరాదిలో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ తీవ్ర నిరాశను కలిగించాయి. అబ్ కీ బార్ 400 సార్ అన్న నినాదం ప్రత్యర్ధుల ఎత్తు ముందు చిత్తు అయింది. ఏది ఏమైనా మరోసారి ఎన్టీయే కూటమిగా బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టబోవడం లాంఛనమే అని చెప్పాలి. కానీ గతంలో మాదిరి బీజేపీకి రికార్డు మెజారిటీ మాత్రం కట్టబెట్టలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం బీజేపికి మంచి సీట్లే కట్టబెట్టారు. తెలంగాణలో బీజేపీ సికింద్రాబాద్ సహా 8 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఇక సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచే పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతూ వస్తోంది.
2019లో మరోసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. అంతేకాదు ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు.ఆ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి .. 3,84780 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 42.05 శాతం వచ్చాయి. ఆ ఎన్నికల్లో కిషన్ రెడ్డి.. 62,114 ఓట్ల మెజారిటీ సాధించారు.
1957లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2024 వరకు మొత్తంగా 19 సార్లు ఎన్నికలు జరిగాయి.
ఇక 2024 బీజేపీ తరుపు కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగరేసారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఉన్న కిషన్ రెడ్డి కేంద్రంలో కొలువు తీరబయే మూడో ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook