Modi About Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి.. పవన్ కళ్యాణ్ వీడియోలు మోత మోగుతున్నాయి. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. కూటమితో కలిసి 21 పోటీ.. చేయగా 21 స్థానాలు గెలిచాడు. ఇక పవన్ పార్టీ ఇంతకీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా బిజెపి, టిడిపి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూటమిగా కలిసి ఈ ఎలక్షన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మోడీ బిజెపి పార్టీకి.. ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఎంపీ సీట్లు రావడం గమనర్హం. కాగా ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని మోదీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ… ఆయనపై పొగడ్తలు గుప్పించారు. పవన్ అంటే పవన్ కాదు అని.. ఓ తుపాన్ అంటూ కామెంట్ చేశారు.
ఇక ఈ NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. మోడీ గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "మోదీ జీ మీరు నిజంగా.. మన దేశానికి స్ఫూర్తి. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం మన దేశం ఎవరికీ తలవంచే అవసరం రాదు. మోదీజీ దిశానిర్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో 91 శాతం పైగా సీట్లు సాధించాము,” అని చెప్పుకోచ్చారు పవన్ కళ్యాణ్.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..”భారతదేశానికి సరైన సమయంలో..మన నరేంద్ర మోదీ సరైన నాయకుడిగా వచ్చారు”, అని తెలిపారు.
కాగా ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ గురించి మోడీ ఇచ్చిన మాస్ ఎలివేషన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో పవన్ అభిమానులు.. ప్రధానమంత్రి సైతం తమ హీరో రేంజ్ ఏంటో చెప్పేసారని.. తెగ సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీటిల్లో సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొని.. ఆ సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయిపిస్తారో లేదో అనేది వేచి చూడాలి.
Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్ పే నంబర్ అంటూ పిచ్చి రాతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter