Ninda Movie Review: 'నింద' మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ హిట్టు కొట్టినట్టేనా..!

Ninda Movie Review: ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో తన కంటూ యూత్ లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. ఇపుడు చాలా యేళ్ల తర్వాత 'నిందా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 09:43 AM IST
Ninda Movie Review:  'నింద' మూవీ రివ్యూ..  వరుణ్ సందేశ్ హిట్టు కొట్టినట్టేనా..!

మూవీ రివ్యూ.. నింద (Ninda)
నటీనటులు.. వరుణ్ సందేశ్, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య, అన్నిజిబి, శ్రేయా రాణి రెడ్డి
మ్యూజిక్: సంతు ఓంకారం
సినిమాటోగ్రఫీ : రమిజ్ నవీత్
ఎడిటర్ : అనిల్ కుమార్
నిర్మాత, డైరెక్టర్ : రాజేశ్ జగన్నాథం

వరుణ్ సందేశ్ ఒకప్పడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చాలా యేళ్ల తర్వాత తను హీరోగా 'నింద' మూవీతో  ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. అనవసరంగా కేసుల్లో ఇరుకున్న అమాయకులను శిక్షల బారి నుంచి తప్పించడానికి పనిచేస్తుంటాడు. అయితే వివేక్ తండ్రి ఓ జడ్జ్ (తనికెళ్ల భరణి) ఓ కేసులో సాక్ష్యాల ఆధారంగా తీర్పు ఇచ్చినట్టు చెబుతాడు. కానీ ఆ కేసులో అతని నిర్ధోషి అంటూ బాధపడుతూ కన్నుమూస్తారు. ఆ కేసును టేకప్ చేసిన వివేక్.. ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. ముళ్లు ముళ్లుతోనే తీయాలనే సామెత ఆధారంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దలను ఎలా ఎదిరించి పోరాడాడనేద  'నిందా' మూవీ  స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

మన సమాజంలో ఒక సామెత.. వంద మంది దోషులు తప్పించుకున్నా.. ఒక నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడనే న్యాయ సూత్రం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఒక వ్యక్తి చేయని తప్పుకు ఎలా శిక్షించబడ్డాడు. ఈ నేపథ్యంలో తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. నిందా కూడా అలాంటి సబ్జెక్టే అయినా.. దాన్ని ఇంకాస్త బెటర్ మెంట్ గా చూపెడితే బాగుండేది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు.ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగినా.. సెకండాఫ్ లో గ్రిస్పీ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు. అంతేకాదు నటీనటులతో మంచి నటన రాబట్టుకున్నాడు. మొత్తంగా సాదాసీదా కథలో తనదైన ట్విస్టులతో ఈ సినిమా సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగించాడు.

అసలు బాలరాజు, మంజులు ఎవరు ? వాళ్ల అనవసరంగా ఈ కేసులో ఎలా ఇరుక్కున్నారు. అందుకు దోహదం చేసిన పరిస్థితులు.. సామాజిక నేపథ్యం వంటివి రోజు వారీ పేపర్లలో మనం చూసే వార్తలనే సినిమాలో వాడుకున్నాడు దర్శకుడు. నిర్మణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్ లో బాగుంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ తన కత్తరకు మరింత పదును పెడితే బాగుండేది.  మొత్తంగా తప్పు చేయని వాడికి శిక్ష పడకూడనే కాన్సెప్ట్ బాగుంది.

నటీనటుల విషయానికొస్తే..
వరుణ్ సందేశ్ లో సీరియస్ నటుడు ఉన్నాడనే సంగతి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ప్రతి చోట అనుభవం ఉన్న సీనియర్ నటుల మాదిరి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

కథనం,

సెకండాఫ్

వరుణ్ సందేశ్ నటన

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

చివరి మాట..ఆకట్టుకునే 'నింద'

రేటింగ్ : 2.75/5

ఇదీ చదవండి: త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. ఆ నేతలకు గోల్టెన్ ఛాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News