Atlee-Salman Khan: సల్మాన్ ఖాన్ తో సౌత్ సూపర్ స్టార్.. అత్యంత పెద్ద మల్టీస్టారర్ కి సిద్ధమైన అట్లీ..

Rajinikanth: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అట్లీ.. ఒక సౌత్ సూపర్ స్టార్ ని కూడా దించబోతున్నారట.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 24, 2024, 02:51 PM IST
Atlee-Salman Khan: సల్మాన్ ఖాన్ తో సౌత్ సూపర్ స్టార్.. అత్యంత పెద్ద మల్టీస్టారర్ కి సిద్ధమైన అట్లీ..

Atlee-Salman Khan Movie: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. బాలీవుడ్ స్టార్ హీరో.. సల్మాన్ ఖాన్ తో సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో సల్మాన్ ఖాన్ తో పాటు మరొక హీరో కూడా ఉండబోతున్నారు అని.. వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రెండవ హీరోగా బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ ని తీసుకోబోతున్నట్లు మొదట పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు.. ఈ సినిమాలో రెండవ హీరో పాత్ర కోసం సౌత్ నుంచి ఒక సూపర్ స్టార్ ని రంగంలోకి.. దింపడానికి అట్లీ ప్రయత్నాలు చేస్తున్నారట. 

ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. తాజా సమాచారం ప్రకారం అట్లీ, సల్మాన్ ఖాన్ రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ రజినీకాంత్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇప్పటిదాకా ఎవరు చూడనటువంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా.. ఇదే అవుతుంది. 

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ సల్మాన్ ఖాన్.. అందరు హీరోలు హాలివుడ్ లో సినిమాలు చేస్తున్నారు.. కానీ నాకు సౌత్ లో సినిమా చేయాలని ఉంది అని చెప్పారు. సౌత్ నార్త్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద నంబర్స్ వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే అట్లీ ఈ ప్లాన్ చేసి ఉండచ్చు. 

అయితే అట్లీ సౌత్ నుంచి హీరోని ఎంపిక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఇద్దరు బాలీవుడ్ హీరోలతోనే సినిమా తీస్తే అది కేవలం హిందీ వరకే పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు రజనీకాంత్ వంటి.. స్టార్ హీరో ఎంట్రీ తో హిందీ తో పాటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తారు. 

ఈ రకంగా అట్లీ పెద్ద ప్లానే వేశారని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో.. మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఈ మధ్యనే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టయన్ సినిమాతో.  బిజీగా ఉన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల కాబోతోంది.

Also read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News