NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల అవకతవకలు, ఒకే సెంటర్‌లో టాప్ ర్యాంకులతో ప్రారంభమైన వివాదం బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ పరిణామాలతో మరించ రచ్చరచ్చగా మారింది. అందుకే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ, ఈడీ రంగంలో దిగాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నీట్‌పై నిరసనలు జరుగుతున్నాయి. ఎన్టీయే వైఖరి, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా వెలుగుచూడటంతో పాటు చాలామంది విద్యార్ధులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ బృందాలు బీహార్, గుజరాత్‌లో బస చేసి దర్యాప్తు ప్రారంభించాయి. సీబీఐలోని ఆర్ధిక నేరాల విభాగం ఈ కుంభకోణంలో ఎవరి ఎలాంటి పాత్ర పోషించారో విచారిస్తోంది. బీహార్ పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ ఆర్ధిక నేరాల విభాగం మే 17న దర్యాప్తు ప్రారంభించింది. పాట్నాలో కాలిన ప్రశ్నాపత్రం, ఎన్టీఏ అందించిన ప్రశ్నాపత్రం ఒకటేనని తేలినట్టు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం సీరియల్ కోడ్ హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్‌కు చెందిందిగా దర్యాప్తులో తేలింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 420, 406, 120 బి ప్రకారం కేసు నమోదు చేసింది.
ఇప్పుడు సీబీఐ విచారణకు ఈడీ దర్యాప్తు తోడు కానుంది. నీట్ పేపర్ లీక్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగేందుకు నిశ్చయించింది. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల వివాదం, ఒకే సెంటర్ నుంచి టాప్ ర్యాంకర్లు రావడం, పేపర్ లీక్ వ్యవహారం ఇలా మొత్తం అన్నింటిపై ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయనుంది. నిందితుల నెట్‌వర్క్, మనీ లాండరింగ్ లింకులపై విచారణ జరపనుంది.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook