India vs England T20 World Cup Semi Final 2 Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. రెండో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్-2లో తలపడనున్నాయి. గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరింది. 2022 సెమీస్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది ఇంగ్లీష్ జట్టు. మరోసారి ఇప్పుడు అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా.. ఆ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ Vs ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్కోరు అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
India vs England Live Updates: వరుణుడి అడ్డంకి.. నిలిచిన మ్యాచ్