Healthy Paratha Recipe: ఆలూ పరాఠాను ఎంత ఇష్టంగా తింటారో అంతే రీతిలో ఆరోగ్యానికి హాని కల్గించవచ్చు. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రాచుర్యమైన ఫుడ్ ఇది. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లో కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇంత ఇష్టమైన ఆలూ పరాఠాతో అనారోగ్యం కల్గించవచ్చు. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే ప్రముఖ న్యుట్రిషనిస్టులు కొన్ని సూచనలిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
పరాఠా ప్రియలకు గుడ్‌న్యూస్. ఎంతో ఇష్టమైన ఆలూ పరాఠాను లేదా పరాఠాను మీరిక మానక్కర్లేదు. స్థూలకాయం లేదా అధిక బరువుకు దారి తీస్తుందనే కారణంతో దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మీకెంతో ఇష్టమైన పరాఠాను ఆరోగ్యాన్నిచ్చే విధంగా కూడా తయారు చేసుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్టులు, వైద్య నిపుణులు. ఆలూ పరాఠా లేదా పరాఠాలు ఎంత ఫేవరెట్ అంటే ఇంట్లోనూ బయటా ఆలూ, పన్నీర్, పప్పు, మటర్, గోభీ, గుడ్లు స్టఫింగ్ చేసే పరాఠాలు కన్పిస్తుంటాయి. వీటిలో ఫ్యాట్ అధికాంగా ఉండటం వల్ల అధిక బరువుకు కారణమౌతుంటాయి. అయితే ఇష్టమైన పరాఠాల్ని హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
పరాఠా అదే పనిగా తింటే లావెక్కుతారనే భయం ఉంటుంది. దీనికి ప్రదాన కారణం స్టఫింగ్ అండ్ కుకింగ్ ఆయిల్. పరాఠాలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ప్రోటీన్లు, ఫైబర్ తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించాలంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా అవసరం.
హెల్తీ పరాఠాలు ఎలా తయారు చేయాలంటే
సాధారణంగా పరాఠా స్టఫింగ్ కింద బంగాళదుంప వాడుతుంటారు. కానీ ఆలూ స్థానంలో చాప్ చేసిన పాలకూర లేదా ముల్లంగి, పప్పు లేదా ప్లాంట్ ఆదారిత ప్రోటీన్ నింపాలి. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అదే సమయంలో గోధుమ పిండి స్థానంలో సోయా పిండి వాడాలి. దాంతో కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ కాకుండా నెయ్యి వాడండి.
Also read: Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook