Pomegranate Juice Benefits: తరచుగా అందరూ పండ్ల రసాలు తాగుతూ ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యం పై దృష్టి సారించేవారు ఎక్కువగా వ్యాయామాలు చేసిన తర్వాత తప్పకుండా ఏదైనా ఒక పండ్ల రసం తీసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రతిరోజు రసాలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే సహజమైన చక్కర శరీరానికి తక్షణమైన ఎనర్జీని ఇచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది ఎక్కువగా యాపిల్, బత్తాయి వంటి పండ్లను జ్యూస్‌లా తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. నిజానికి దానిమ్మతో తయారుచేసిన జ్యూస్‌ను తాగడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో అధిక మోతాదులో పోషకాలు లభించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె సమస్యలతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడతాయి. ఇవే కాకుండా దానిమ్మ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
కొలెస్ట్రాల్‌ను కలిగిస్తుంది:
ప్రస్తుతం చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి దానిమ్మ రసం ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో లభించే కొన్ని మూలకాలు చెడు కొవ్వును తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే దానిమ్మ పండ్ల రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
గుండె ఆరోగ్యం కోసం:
చాలామందిలో గుండెపోటు రావడం ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. నిజానికి గుండెపోటు కారణంగా మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే దానిమ్మ రసంలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను దెబ్బతినకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా కాపాడతాయి.
వ్యాయామం చేసే వారి కోసం..:
వ్యాయామం చేసేవారు తప్పకుండా దానిమ్మ రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇది తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా వాపులను తగ్గిస్తుంది. దీంతో పాటు తక్షణ శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అలసటను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
మెదడు ఆరోగ్యం కోసం..:
ప్రస్తుతం చాలామందిలో అల్జీమర్స్ వ్యాధి విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. నిజానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రతిరోజు దానిమ్మ రసం తాగడం వల్ల ఈ అల్జీమర్స్ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
సంతాన ఉత్పత్తిని పెంచుతుంది:
ప్రతిరోజు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు సులభంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతానలేని సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దానిమ్మలో ఉండే కొన్ని గుణాలు వీర్య కణాలను పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి స్పెర్ము కౌంట్ పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా రోజు ఉదయం దానిమ్మ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రోగ నిరోధక శక్తి పెరగడానికి:
ప్రస్తుతం చాలామంది ఇన్ఫెక్షన్లతో పాటు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి దానిమ్మ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కొన్ని గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి