Tauba Tauba Step: యువరాజ్ సింగ్, రైనా, హర్భజన్ సింగ్ లపై పోలీసు కేసు.. కొంప ముంచిన వీడియో ఇదే..

Vicky Kaushal Tauba Song: హీరో విక్కి కౌశాల్ పాట తౌబా తౌబా పాట సోషల్ మీడియాలో ఫుల్ ఫెమస్ అయ్యింది. ఈ పాటకు ఫ్యాన్స్ కూడా మాస్ స్టెప్పులు వేస్తూ పాటను ఎంజాయ్ చేశారు. కానీ ఇటీవల ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం మాత్రం వివాదాస్పదంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 15, 2024, 10:12 PM IST
  • మండిపోయిన దివ్యాంగుల సంఘం..
  • సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న అభిమానులు..
Tauba Tauba Step: యువరాజ్ సింగ్, రైనా, హర్భజన్ సింగ్ లపై పోలీసు కేసు.. కొంప ముంచిన వీడియో ఇదే..

Police filed case against Indian cricketers Harbhajan singh Yuvraj singh suresh raina: సాధారణంగా ఫాన్స్ తమ అభిమాన  హీరో లేదా సినిమాలోని పాటల్ని ఎంతో ఇష్టపడుతుంటారు.. ఇక ఆ పాటలో తమహీరో వేసిన స్టెప్పులు వేస్తుంటారు.మరికొందరు అదే పాటకు తమదైన స్టైల్ లలో కూడా స్టెప్పులు వేసి రీల్స్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో విక్కీ కౌశాల్ తౌబా తౌబా పాట  కూడా ఎంతో ఫెమస్ అయ్యింది.ఈ పాటకు చాలా మంది తమదైన స్టైల్స్ లో స్టెప్పులు వేసి రీల్స్ తీసుకున్నారు.ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు తీసిన రీల్స్ ఇప్పుడు దేశంలో తీవ్ర రచ్చగా మారింది. దీంతో ఏకంగా హర్భజన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై కేసులు కూడా నమోదయ్యాయి. 

 

పూర్తి వివరాలు..

ఇటీవల భారత ప్లేయర్లు.. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ ను గెలుచుకున్నారు. దీంతో ఫుల్ జోష్ తో తమ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఆ జోష్ లో చేసిన పనులు మాత్రం ఇప్పుడు వారి మెడకే చుట్టుకున్నాయి. ముఖ్యంగా.. హర్భజన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు.. ముగ్గురు విక్కీ కౌశాల్ పాటకు.. కుంటు కుంటూ రీల్స్ చేశారు.ముగ్గురు కూడా ఒకరి తర్వాత మరోకరు కుంటుతున్నట్లు వీడియోలు, రీల్స్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత తమ శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయని కామెంట్లు చేశారు.

శరీరంలో ప్రతిబాడీ పార్ట్ నొప్పిగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మా వెర్షన్ తౌబా తౌబా అంటూ క్యాప్షన్ ను జతపర్చారు. అంతేకాకుండా.. దీన్ని విక్కీ కౌశాల్, కరణ్ లకు ట్యాగ్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దీనిపై దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని, అమర్యాదగా ప్రవర్తించారని కూడా...నేషనల్ సెంటరన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెట్ ఫర్ డిసెబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈముగ్గురిపై కూడా కేసునమోదు చేశారు.

Read more: Traffic signals: ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్.. వారు సిగ్నల్ జంప్ చేసిన నో ఫైన్.. కారణమిదే..

వీరిపై బీసీసీఐ డిసిప్లీనరీ చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేశారు. కాగా, వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నిలో.. యువరాజ్ సింగ్ సారథ్యంలో భారత్ విక్టరీ సాధించింది. ఫైనల్ లో పాక్ పై మన జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొంది వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. సమాజంలో ఒక మంచి ప్రభావంను కల్గజేసే పొజిషన్ లో ఉండి, ఇలాంటి పనులు చేయడం ఏంటని కూడా చాలా మంది వీరి తీరును విమర్శిస్తున్నారు. ఈ ఘటన మాత్రం దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News