High Bp And Diabetes Foods To Avoid: డయాబెటిస్, అధిక రక్తపోటతో బాధపడే వ్యాధిగ్రస్తులు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులతో బాధపడేవారు కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఆహారంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తపోటు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఫూడ్స్‌కు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.
అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పదార్థాలు:
వైట్ బ్రెడ్:
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వైట్ బ్రెడ్‌ను అసలు తినకూడదు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక శాతంలో ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.
ఈ వైట్ బ్రెడ్ అనేది అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి హానికరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది వైట్ రైస్‌తో ప్రాసెస్ చేస్తారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ బ్రెడ్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.
వైట్ పాస్తా:
వైట్ పాస్తా ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైన ఆహారం. ముఖ్యంగా ఈ పాస్తాలో తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. దీనికి బదులుగా తృణధాన్యాలను తీసుకోవడం చాలా మంచిది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారు దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఈ పాస్తాకు బదులుగా రాగి జావ, పండ్లు, కూరగాయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
బంగాళాదుంప:
బంగాళాదుంపలో అధిక శాతం స్టార్చ్, సోడియం ఉంటుంది. బంగాళాదుంపలతో తయారు చేసిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులకు మంచిది కాదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఇది గ్లైసెమిక్ లోడ్‌ను పెంచుతుంది. అధికరక్తపోటు సమస్యలతో బాధపడేవారు సోడియంను ఎక్కువగా తీసుకోకూడదు. వీటికి బదులుగా తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్న దుంపలను కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది.
ఉప్పు:
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారు రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పుడుతాయి.
ఆల్కహాల్:
అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, మధుమేహాన్ని నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి