Smita Sabharwal Comments: కేంద్ర సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మితా వ్యాఖ్యలపై దివ్యాంగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్మితా వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. స్మితా వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిట్‌చాట్‌లో స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎదుటి వారి వైకల్యాన్ని చూసి నిందించకూడదు' హితవు పలికారు. ఆమె వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు.
'మేము ప్రభుత్వంగా రిజర్వేషన్లు ఇస్తున్నాం. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. ఆమె వ్యాఖ్యలు ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి.. అయినా కూడా ముఖ్యమంత్రి దృష్టికి మేమ తీసుకువెళ్తాం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పూలేలాంటి వాళ్లు ఎన్నో అవమానాలు అనుభవించారు. ఆ తరువాత ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు' అని మంత్రి సీతక్క తెలిపారు.
'అందరూ ఐఏఎస్ అధికారులకు ఇచ్చిన అవకాశాలు స్మితా సబర్వాల్‌కు కూడా ఇస్తున్నాం. ఆమె రిజర్వేషన్లపై మాట్లాడి మళ్లీ సమర్ధించుకోవడం మంచి పద్దతి కాదు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు చాలా విధుల్లో తేడా ఉంటుంది' అని మంత్రి సీతక్క తెలిపారు. కాగా సీతక్క వ్యాఖ్యలతో స్మితా సబర్వాల్ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే స్మితా సబర్వాల్‌పై పోలీసులకు దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. కాకపోతే కేసు నమోదు కాలేదు. అయితే దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలతో భవిష్యత్‌లో స్మితా సబర్వాల్ పదవికి గండం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్మితా సబర్వాల్‌కు అప్రాధాన్య పోస్టులు ఇచ్చి అవమానిస్తోంది. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న స్మితాకు మరింత కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి