Central Budget Sessions:పార్లమెంట్ మొదలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై రభస కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలతో సభలు రచ్చ రచ్చగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా అదే స్థాయిలో అపోజిషన్ ను కట్టడి చేయాలని రూలింగ్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. దీంతో సమావేశాలు గతంలో ఎప్పుడూ లేనట్టుగా వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీలో ఉభయ సభల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గత పదేళ్లు వన్ సైడ్ గా జరిగిన సభలు ఈ సారి మాత్రం దానికి భిన్నంగా జరగుతున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఈ సారి ప్రతిపక్షాల నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. బడ్జెట్ మొదలు ఏ అంశంలోనైనా అధికార పక్షాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి గట్టిగా నిలదీస్తుంది.
మోడీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సభలో , సభ వెలుపల కూడా నిరసనలకు దిగుతుంది. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కొనసాగుతున్న ప్రతిపక్షాల ఆందోళనలు , ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అపోజిషన్ పార్టీల ఆందోళన మరింత పీక్స్ కు వెళ్లింది. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అన్ని వర్గాలను తీవ్రంగా మోసం చేసిందని.. కేవలం ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి మిగితా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు చేసింది. అంతటితో ఆగని ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కూడా చేపట్టాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రోజు రోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter