National Pension Sceme: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పాత పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా ప్రవేశ పెట్టిన జాతీయ పెన్షన్ పథకం మంచి ప్రజాదరణ పొందుతుంది. ఎక్కువ మంది ప్రజలు తమ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఎన్పీసీని ఉపయోగించుకుంటున్నారు. ఇక పాత టాక్స్ విధానంలో రూ. 50 వేల వరకు అదనపు ప్రయోజనం పొందుతున్నారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో నేషనల్ పెన్షన్ స్కీమ్ లో కొన్ని అదనపు ప్రయోజనాలను చేర్చింది కేంద్ర ప్రభుత్వం.
NPS: కంపెనీల సహకారం పెరిగింది
మూడు రోజులు క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రకటన ఒకటి. NPSకి కార్పొరేట్ సహకారం 10% నుండి 14%కి పెంచబడింది. ఇది ఒక ప్రధాన మార్పు అని చెప్పాలి.
NPS పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం
తాజా బడ్జెట్ తో ఈ NPS పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీని వల్ల కొద్దిపాటి ప్రయోజనాలున్నాయి. ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికీ మాత్రమే ఇది వర్తిస్తుంది. పన్ను చెల్లించని వారికీ ఇది ఉపయోగించబడదు.
NPS: తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు..
మీరు వ్యక్తిగతంగా పన్ను కేటగిరికీ చెందిన వారైతే..NPS స్కీమ్ లో చేరవచ్చు. ఉద్యోగి అయితే.. దాని ప్రకారం కంపెనీ సదరు ఉద్యోగి ఇష్టం ప్రకారం ఈ స్కీమ్ లో చేరవచ్చు. వ్యక్తిగతంగా కూడా ఈ పెన్షన్ స్కీమ్ లో చేరవచ్చు.
బడ్జెట్ లో ప్రస్తావించిన ప్రకారం ఉద్యోగి మరియు ఏదైన సంస్థ అందించే NPS ఖాతాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. తమంతట క్లెయిట్ చేసుుకున్న వారికీ దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
బడ్జెట్‌లో చేసిన మార్పులు ఏమిటి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా, NPSకి సహకరించే యజమాన్యాలు/సంస్థలు కొత్త లెవీ కింద ఉద్యోగుల వేతనంలో 14 శాతం విధిగా జమ చేయాలి. ఇంతకుముందు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యజమాన్యం లేదా కార్పొరేట్ సహకారం 14% ఉండేది. ప్రైవేట్ కంపెనీలతో సహా ఇతర కంపెనీలకు ఇది 10% మాత్రమే ఉండేది.
NPS: పాత పన్ను విధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పాత పన్ను విధానంలోని వ్యక్తులకు NPS బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగులు సెక్షన్ 80CCD (1), సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు తగ్గింపుకు అర్హమైనది. సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 అదనపు సహకారం కూడా అనుమతించబడుతుంది. దీని వలన మొత్తం ప్రయోజనం రూ. 2 లక్షలకు చేరుకుంటుంది.
కొత్త పన్ను విధింపు
కొత్త పన్ను విధానం ప్రకారం ఉద్యోగుల విరాళాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోలేరు. అయితే ఈసారి బడ్జెట్‌లో చేసిన మార్పులు ఇప్పుడు అదనపు ప్రయోజనాలను తెచ్చిపెట్టనున్నాయి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter