3 ias aspirants killed as coaching centre heavy rain flood in delhi: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్‌లో వరద పోటెత్తింది. ఈ ఘటనలో.. ముగ్గురు అభ్యర్థులు సంఘటన స్థలంలోనే మరణించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్, మరొకరిని తెలంగాణకు చెందిన తాన్యా సోని, మూడో వ్యక్తిని కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నెవిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్యయంతో రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు. కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థుల మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ముగ్గురునీ గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసినట్టు డీసీపీ తెలిపారు. అభ్యర్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఆందోళన...
ఇదిలా ఉండగా.. ఘటనపై దేశవ్యాప్తంగా నిరసలను మిన్నంటాయి. ఇప్పటికే పోలీసులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థుల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరనలకు దిగారు. వెంటనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో.. నిరసనలకు దిగిన విద్యార్థులను అడిషినల్ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ విద్యార్థులుతో మాట్లాడారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
ఈ ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారని, ఏ విషయాన్ని తాము దాచిపెట్టమని, చట్టబద్ధంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని, విచారణ జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాధ్యతారాహిత్యంపై అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాల్ సైతం ఘటనా స్థలికి వెళ్లి అభ్యర్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.
కాగా ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని మరి కాసేపట్లో కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కోచింగ్ సెంటర్ సెల్లార్‌లో నీళ్లు నిండి విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది.
Read more: Smart phone: మీ మొబైల్ ను చోరీ చేశారా..?.. డోంట్ వర్రీ.. నిముషాల్లో ఈ టెక్నాలజీతో ట్రాక్ చేయోచ్చు..
సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోగల రవూస్ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు వచ్చి చేరింది. దాంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను కాపాడారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి