Kerala Landslides: కేరళలో తరచూ జరిగే విలయాలకు కారణమేంటి, అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది

Kerala Landslides and Heavy Reasons: కేరళ ఎంత అందమైన ప్రాంతమో ప్రకృతి విపత్తులకు అంతగా ప్రసిద్ధి. భారీ వర్షాలు, జల ప్రళయాలు, కొండ చరియలు విరిగిపడటం ఇక్కడ సర్వ సాధారణంగా మారిపోయింది. పశ్చిమ కనుమల్లో కొలువుదీరిన కేరళలో ఎందుకీ విపత్తులు..కారణాలేంటి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2024, 10:43 AM IST
Kerala Landslides: కేరళలో తరచూ జరిగే విలయాలకు కారణమేంటి, అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది

Kerala Landslides and Heavy Reasons: కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరుసగా కొండ చరియలు విరిగిపడి పెను ఉపద్రవం ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఈ విపత్తుకు 151 మందికిపై బలయ్యారు. మరెందరో ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కేరళలో ఈ తరహా విపత్తులు కొత్త కాదు. జల ప్రళయాలు ఊహించనివి కావు. ప్రకృతి కేరళపై ఎప్పుడూ పగబడుతూనే ఉంటుంది. ఎందుకీ పరిస్థితి, అంత అందమైన కేరళ రాష్ట్రంలో జల ప్రళయం ఎందుకు

అటవీ ప్రాంతం తగ్గడం ఓ కారణం

ఇస్రో విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్స్ పటంలో అత్యంత ప్రమాదకరమైన 30 కొండ చరియల్లో 10 కేరళలో ఉన్నాయి. 2021లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం కేరళలో సంభవించే కొండ చరియల ఘటనల్లో 59 శాతం ప్లాంటేషన్ ప్రాంతాల్లోనే జరిగాయి. 1950 నుంచి 2018 వరకూ వయనాడ్ జిల్లాలో 62 శాతం అటవీ ప్రాంతం మాయమైనట్టు తెలిసింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం 1950 వరకు వయనాడ్ జిల్లాలో 85 శాతం అటవీ ప్రాంతమే ఉండేది. అటవీ ప్రాంతం తగ్గేకొద్దీ భారీ వర్షాలు పడే కొండప్రాంతాలు వదులుగా మారసాగాయి. అంటే భూమి పటుత్వాన్ని కోల్పోసాగింది.

వాతావరణంలో మార్పులు

కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అట్మాస్ఫియర్ రాడార్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అభిలాష్ చెప్పినదాని ప్రకారం అరేబియా సముద్రం వేడెక్కుతుండటం ఈ ప్రాంతంలో ఊహించని భారీ వర్షాలకు కారణంగా ఉంది. సౌత్ ఈస్ట్ అరేబియన్ సముద్రం అంతకంతకూ వేడెక్కుతుండటంతో కేరళ సహా పశ్చిమ కనుమల్లోని ప్రాంతాలు పర్యావరణ పరంగా అస్థిరంగా ఉంటున్నాయి.అరేబియా సముద్రంలోని వేడి కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. దాంతో తరచూ అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ తరహా పరిస్థితి కేరళలో గత 8 ఏళ్ల నుంచి కన్పిస్తోంది. 

కేరళలో జల ప్రళయాలు, విపత్తులు

2018 ఆగస్టులో వచ్చిన వరద అతి పెద్దది. ఏకంగా 483 మంది మరణించారు. 14.5 లక్లలమందిని పునరావాస శిబిరాలకు తరలించారు. 57 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇది ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విషాదం

2019లో వయనాడ్ జిల్లా పుత్తుమలలో కొండ చరియలు విరిగిపడి 17 మంది మరణించారు

2021 అక్టోబరులో ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి 35 మంది మృత్యువాత పడ్డారు

2022 ఆగస్టులో ఆకస్మిక వరదలతో 18 మంది మరణించారు

2015 నుంచి 2022 వరకూ దేశంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు 3,782 జరగగా అందులో 2,239 ఘటనలు కేరళలోనే జరిగాయంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also read: Wayanad Landslide Reasons: వయనాడ్ విపత్తుకు కారణాలేంటి, ఎందుకు పసిగట్టలేకపోయారు, నది రెండుగా చీలిందా<

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News