ఫొని తుపాన్ సమయంలో పుట్టిన పాపకు ఆ పేరే పెట్టారు

ఫొని తుపాన్ సమయంలో పుట్టిన పాపకు ఆ పేరే పెట్టారు

Last Updated : May 3, 2019, 04:30 PM IST
ఫొని తుపాన్ సమయంలో పుట్టిన పాపకు ఆ పేరే పెట్టారు

భువనేశ్వర్: అది ఒడిషా రాజధానిలోని భువనేశ్వర్‌లో వున్న రైల్వే ఆస్పత్రి. సమయం ఉదయం 11:03 గంటలు అవుతోంది. ఓవైపు ఫొని తుపాన్ భువనేశ్వర్‌ని అతలాకుతలం చేస్తోంది. నగరంలోని జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది. ఫొని తుపాన్ అప్పుడప్పుడే ఒడిషాలోని పూరి తీరాన్ని తాకడంతో ఆ తుపాన్ ప్రభావంతో భువనేశ్వర్‌లోనూ అప్పుడు గంటకు 175 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురుస్తోంది. జనన, మరణాలకు విపత్కర సమయాలు, ప్రకృతి విళయాలు అడ్డం కావు కనుక అదే సమయంలో ఓ నిండు గర్బిణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఆ రైల్వే ఆస్పత్రికొచ్చింది. మంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో హెల్పర్‌గా పనిచేస్తోన్న ఆ మహిళ ఓ పండంటి ఆడశిశువుకి జన్మనిచ్చింది. విపత్కర సమయంలో తుపాన్ గండాన్ని దాటుకుని ప్రాణాలు పోసుకున్న ఆ పాపకు ఫొని అనే పేరే పెట్టుకుంది ఆ తల్లి. 

ఓవైపు భయంకరమైన తుపాన్.. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం మధ్య ప్రసవించిన ఆ తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితమే అని వైద్యులు అని చెప్పడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Trending News