Monsoon Dandruff Home Remedies: మన జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చుట్టూ ఆరోగ్యంగా, మందంగా, అందంగా పెరుగుతుంది. జుట్టు చిక్కులు పడకుండా పొడుగ్గా పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో మారుతున్న వాతావరణం వల్ల చుండ్రు ఎక్కువగా పేరుకుంటుంది. దీని వల్ల హెయిర్ ఫాల్ మొదలవుతుంది అంతేకాదు జుట్టు విపరీతంగా దురద కూడా పెడుతుంది.
వర్షాలు కురవడం, వాతావరణ మార్పుల వల్ల తలలో చుండ్రు పేరుకొని ఫంగస్ మొదలవుతుంది. దీంతో కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. కొన్ని రకాల నేచురల్ ఆయిల్ కి చెక్ పెట్టవచ్చు. సౌందర్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చేస్తాయి జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
కలబంద..
కలబందలో మాయిశ్చర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇందులో సహజ సిద్ధమైన ఎంజైమ్స్ డాండ్రఫ్ కి వ్యతిరేకంగా పోరాడి కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కలబందతో మన జుట్టు కుదుళ్లకు బాగా మసాజ్ చేసి ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి. కలబంద యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటుంది ఫంగస్ పేరుకోకుండా చుండ్రు రాకుండా కాపాడుతుంది.
టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్లో కూడా యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డాండ్రఫ్ కి వ్యతిరేకంగా పోరాడతాయి కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ రెగ్యులర్ షాంపుతో కలిపి బాగా జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాదు కొబ్బరి నూనెలో కలిపి కూడా జుట్టుకు పట్టించవచ్చు కొద్ది నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేయాలి.
నిమ్మరసం..
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది పీహెచ్ లెవెల్ ని సమతుల్యం చేస్తుంది ఒక ఐదు పై ఐదు నిమిషాల పాటు కుదుళ్లకు బాగా అప్లై చేయాలి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును కడగాలి నిమ్మరసం చుట్టుకు అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కల్పిస్తాయి అంతేకాదు కుదులు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..
మెంతులు..
మెంతుల్లో ప్రోటీన్స్ నికొటిన్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది డాండ్రఫ్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. జుట్టు మెరిసేలా చేస్తుంది. మెంతులు జుట్టు కుదుళ్ళను బలపరుస్తాయి, రాకుండా కాపాడతాయి. రాత్రంతా మెంతులు నానబెట్టి ఉదయం పేస్టు చేసుకొని జుట్టుకు అప్లై చేయాలి. ఒక అరగంట తర్వాత జుట్టు వాష్ చేసుకోవాలి. మెంతుల్లో ఉండే నికోటిని ఆసిడ్ డాండ్రఫ్ కి చెక్ పెడుతుంది.
పెరుగు..
పెరుగు ప్రోబయోటిక్ ఇది జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పెరుగు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జుట్టు అంతటికీ అప్లై చేసి అరగంట తర్వాత తల స్నానం చేయటం వల్ల ఇందులోని ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి దురదను రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ వెళ్లాల్సిన టాప్ 7 రోడ్డు మార్గాలు ఇవే..
కొబ్బరి నూనె..
ఇది జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు కలిగి ఉంటుంది జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. వేడి చేసి జుట్టు అంతటికీ అప్లై చేసి కొన్ని గంటల తర్వాత లేకపోతే రాత్రి జుట్టుకు అప్లై చేసి ఉదయం తలస్నానం చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.