Ram Pothineni: నా ఫోన్ లో పూరీ జగన్నాథ్ పేరు అలా ఉంటది.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Double Ismart Pre Release Event: ఉస్తాద్ రామ్ పోతినేని.. సినిమాలోనే కాదు బయట కూడా డైలాగులు అంతే స్ట్రాంగ్ గా చెబుతాడు.. అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో.. రామ్ పోతినేని నటిస్తున్న.. పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ టీం భారీ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఈ క్రమంలో రామ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 12, 2024, 05:14 PM IST
Ram Pothineni: నా ఫోన్ లో పూరీ జగన్నాథ్ పేరు అలా ఉంటది.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni Double Ismart Update: ఉస్తాద్ రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్’మూవీతో.. తన లక్ ట్రై చేయడానికి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  కొద్దికాలంగా సరియైన హిట్ కోసం ఎంతో ట్రై చేస్తున్న రామ్‌ కి ఈ మూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. మరోపక్క పూరి జగన్నాథ్ కూడా ఈ చిత్రంపై.. తన అన్ని హోప్స్ పెట్టుకున్నారు. అందుకే మంచి ప్రమోషనల్ కంటెంట్ తో.. నేషనల్ వైడ్ మూవీ పై బజ్ క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి ఫ్రీక్వల్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో జరిగింది. ఇస్మార్ట్ శంకర్ ఫ్రీ రిలీజ్.. ఈవెంట్ కూడా వరంగల్లోనే జరగడం గమనార్హం. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన రామ్ పోతినేని ఇదే విషయాన్ని ప్రస్తావించి.. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫ్రీ రిలీజ్ కోసం వరంగల్ కి వచ్చాం, తిరిగి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫ్రీ రిలీజ్ ..కోసం వరంగల్ కి రావడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. 

‘పూరి గారితో కలిసి ఎనర్జీ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చార్మి గారు చాలా మంచి ఫైటర్.. ఆమె లేకుండా ఈ సినిమా పాసిబుల్ అయ్యేదే కాదు. నా దృష్టిలో పూరి గారు తెలుగు సినిమాలో మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన ఒక గన్ లాంటి.. వ్యక్తి. పేల్చే గన్.. బాగుంటేనే కదా బుల్లెట్ బలంగా బయటకు వెళ్తుంది. అందుకే పూరి గారి లాంటి మంచి గన్.. అందరి యాక్టర్ సక్సెస్ కి కావాలి. నా ఫోన్లో కూడా పూరి పేరుని గన్..అని పెట్టుకో ఉంటాను. డబల్ ఇస్మార్ట్ లో నేను చేసే పాత్ర మెంటల్ మాస్.. మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది…’ అని రామ్ అన్నారు.

మరోపక్క పూరి మూవీ గురించి మాట్లాడుతూ సెట్స్ లో రామ్ ఎనర్జీ చూసి.. తనకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అని పేర్కొన్నారు. అంతేకాదు రామ్ ఒక మంచి యాక్టర్, డాన్సర్ అని అన్న పూరి.. అతను లేకపోతే ఈ మూవీ లేదు అని తెగ పొగిడేశారు. హీరోయిన్ కావ్య ఈ మూవీలో.. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందని.. ఆలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని పూరి అన్నారు. కాగా ఈ మూవీలో ఆలీతో.. ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తాయట. ఒకప్పటి అలీ కామెడీని ఈ మూవీలో చూడవచ్చు అని చెప్పుకొచ్చారు పూరి. 

కాగా ఈ మూవీ రామ్ తో పాటు.. పూరికి కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ సాధించడానికి ఇద్దరు చాలా ప్రయత్నిస్తున్నాడు. మరి ఆగస్టు 15 విడుదల కాబోతున్న ఈ సినిమా.. ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.

Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News