Kalki Bujji in part 2: ప్రభాస్ కల్కి మూవీలో.. బుజ్జి పాత్ర ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా నాన్ స్టాప్ గా మాట్లాడుతూ.. అంతకంటే నాన్ స్టాప్ గా.. థియేటర్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది బుజ్జి పాత్ర. కల్కి పార్ట్ 2 లో కూడా ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఉందని టాక్. అమితాబచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకొనే, గౌతమి ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. మహాభారతం నేపథ్యంలో సాగే ఓ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రికార్డ్ నెలకొల్పింది.
విమర్శకుల ప్రశంసలు పొందిన..మహానటి మూవీ డైరెక్టర్ గా వ్యవహరించిన నాగ్ అశ్విన్‌తో.. కీర్తికి మంచి స్నేహం ఉంది. అందుకే ఆమె బుజ్జి పాత్రకి.. తన గాత్రాన్ని అందించింది అని అందరూ భావించారు. అయితే నిజానికి మొదట కీర్తి సురేష్‌ని.. కల్కి మూవీలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించారట. మొదట ఆ పాత్రని కాదు.. అనుకున్న కీర్తి ఫైనల్‌గా బుజ్జికి తన వాయిస్‌ని అందించింది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ వెల్లడించింది.
అయితే తనకు ఏ పాత్రను ఆఫర్ చేశారు అన్న విషయం పూర్తిగా తెలియదని.. కానీ మూవీలో ఆ పాత్ర కాస్త ముఖ్యమైనదే అని కీర్తి అంది. అయితే అప్పుడు ఆ పాత్రను ఒప్పుకోకపోవడం.. తనకు ఎంతో సంతోషం కలిగించే విషయమని కీర్తి పేర్కొంది. ‘అప్పుడు ఆ పాత్రను వద్దు అనుకున్నాను.. కాబట్టే బుజ్జి పాత్రకి వాయిస్ అందివ్వగలిగాను. ఇలా బుజ్జికి నా గాత్రాన్ని అందించే అవకాశం నాకు ఎంతో థ్రిల్లింగా.. ఛాలెంజింగ్‌గా అనిపించింది. మొదట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్‌కి నేను వాయిస్ ఇవ్వాలి.. అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు .ఈ మూవీకి చేయడానికి ముందు అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన బుజ్జి & భైరవ కు డబ్బింగ్ చెప్పాను. ’అని కీర్తి అంది. అంతేకాదు వివిధ భాషల్లో బుజ్జి కి డబ్బింగ్ చెప్పే ప్రక్రియను తాను ఎలా ఆస్వాదించిందో.. ఎన్ని మోడ్యులేషన్స్ పై ప్రయోగాలు చేసిందో కూడా కీర్తి వెల్లడించింది. మొత్తానికి అలా సినిమాలో ఓ పాత్ర పోషించాల్సిన కీర్తి కాస్త బుజ్జికి వాయిస్ ఓవర్గా మారింది.
Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీని లాగిన కేటీఆర్
Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్ ఇస్తా: చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter