Chiranjeevi blockbluster movies: మెగాస్టార్‌గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
వాల్తేరు వీరయ్య: చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా రవితేజ మరో ముఖ్యపాత్రలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఖైదీ నంబర్ 150: చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
శంకర్ దాదా ఎంబీబీఎస్: హిందీలో హిట్టైన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఠాగూర్ : వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘ఠాగూర్’. విజయ్ కాంత్ హీరోగా ‘రమణ’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇంద్ర : వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమా 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది.
ఘరానా మొగుడు : కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నగ్మా కథానాయిగా నటించింది. ఘరానా మొగుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
గ్యాంగ్ లీడర్: విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ మూవీ చిరు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి : జగదేకవీరుడు అతిలోకసుందరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు: ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
యముడికి మొగుడు : మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుముడికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పసివాడి ప్రాణం: అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఏ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పసివాడి ప్రాణం. ఈ చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఖైదీ : సంయుక్తా మూవీస్ బ్యానర్ పై ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఖైదీ. హీరోగా చిరు కెరీర్‌ను ఛేంజ్ చేసిన మూవీగా రికార్డులకు ఎక్కింది.
అభిలాష: చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అభిలాష’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు ఇండస్డ్రీ హిట్స్ గా మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని టాప్ చిత్రాలను మాత్రమే ప్రస్తావించాము.