Telangana Latest Political News: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య ఆ ఇంటి దగ్గరకు తరుచూ వస్తున్నారట. ఏ మాత్రం టైం దొరికినా సరే అక్కడ వాలిపోతున్నారట. వేకువ జాము నుంచి మొదలు అర్థ రాత్రి వరకు ఆ ఇంటి చుట్టూ కన్నులు కాయలు కాసేలా వేచి చూస్తున్నారట. అయితే ఇంతలా ఎవరి ఇంటి చుట్టూ అనుకుంటున్నారా..మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర.ఎందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అంతలా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా...త్వరలో పదవుల జాతర మొదలు కానుందని. అధిష్టానం నుంచి కూడా పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఆమోదంతో ఏ క్షణంలోనైనా పదవుల పందేరం ఉండొచ్చని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. దీంతో చిన్న స్థాయి నుంచి బడా స్థాయి నేతల వరకు అందరూ రేవంత్ రెడ్డి నివాసం దగ్గర తెల్లారు లేచింది మొదలు పచార్లు కొడుతున్నారట. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ఇంటి దర్గరే కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారట.
రేవంత్ రెడ్డి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. అయితే కొందరు మాత్రం ఏకంగా రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ లేకుండా ఏకంగా ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. అలాంటి వాళ్లను సీఎం భద్రతా సిబ్బంది అడ్డుకుంటుందట. మీకు సీఎం అపాయింట్ మెంట్ లేదు మీరు రేవంత్ రెడ్డిని కలవడం కుదరదు అంటూ నిరద్వందంగా పంపిస్తున్నారట. దీంతో ఆ నేతలు ఉస్సూరుమంటున్నారట. ఇటీవల ఇద్దరు మాజీ మంత్రలు ఇలా రేవంత్ రెడ్డి ని కలవడానికి అపాయింట్ మెంట్ లేకుండా కలిసే ప్రయత్నం చేశారట. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి సార్ మీకు అపాయింట్ మెంట్ లేదు. మా పైవాళ్లు మా పై సీరియస్ అవుతారు అని నచ్చజెప్పి పంపించారట. దీంతో ఆ ఇద్దరు నేతలు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారట.
అయితే ఇద్దరు మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక కాంగ్రెస్ కండువా కప్పుకున్నవాళ్లే కావడం విశేషం. అందునా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిలో భాగంగానే ఆ ఇద్దరు సీనియర్ నేతలు రేవంత్ ను కలిసి తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని అక్కడికి వచ్చారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందని ప్రచారం జరుగుతున్న దరిమిలా తాము కూడా రేసులో ఉన్నామని చెప్పడానికే రేవంత్ ను కలిసే ప్రయత్నం చేశారని ఆ ఇద్దరి నేతల సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు ద్వితీయ శ్రేణి నాయకులు మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అసలే శ్రావణ మాసం కావడంతో నేతలు పదవుల భర్తీ కోసం ఎదరు చూస్తున్నారు. శ్రావణ మాసం ముగిసే లోపు మంత్రి వర్గ విస్తరణతో పాటు కీలక పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం జరగుతుంది.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరగుతుంది. అటు అధిష్టానం పెద్దల నుంచి కూడా రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేసుకున్నారని రేవంత్ టీం చెబుతుంది. ఇప్పుడు మంత్రివర్గంలో చోటుకోసం నేతలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్కర్గు కొడుతున్నారట. ప్రస్తుతం నలుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి పదవులు పొందే ఆ నలుగురు నేతలు ఎవరా అని చర్చ జరుగుతుంది. నలుగురిలో తమ పేరు ఉంటుందని కొందరు నమ్మకంగా చెబుతుంటే మరి కొందరు తమ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
ఇంకొందరైతే తాము కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలిని ఆధిష్టానం, రేవంత్ రెడ్డిని కలుస్తామని చెబుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి నివాసం నేతల రాకతో సందడి సందడిగా మారుతుందట. సీఎం రేవంత్ రెడ్డిని కలవలేని వారు ప్రత్యామ్నాయంగా రేవంత్ సోదరులను, కుటుంబ సభ్యులను కలిసి రేవంత్ కు తమ గురించి చెప్పాలని వారితో విన్నవించుకుంటున్నారట.పదవుల కోసం పోటీ పడుతున్న నేతలు ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి మరి. పదువులు ఆశిస్తున్న నేతల్లో ఎవరికి అదృష్టం వరించనుంది..ఎవరిని దురదృష్టం వెంటాడుతుందో మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.