Watch Viral Video: చపాతీలు అన్నం కంటే ఆరోగ్యకరమని ఎక్కువ శాతం మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే రైస్‌లో కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అయితే, ఒక్కోసారి చపాతీలు మిగిలిపోతాయి. వాటిని ఏం చేయాలో తెలియక కొంతమంది పడేస్తారు. అయితే, ఈ మిగిలిన రొట్టెలు మరుసటి రోజు తిన్నా మరింత ఆరోగ్యకరం. కానీ, ఈ మిగిలిన రొట్టెలతో మీరు స్వీట్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఏ వంట అయినా ఎక్కువ లేదా తక్కువ అవుతుంది. రొట్టెలు మిగిలిపోతే కూడా పారవేయకుండా ఇలా స్వీట్ రిసిపీ తయారు చేసుకోండి. మిగిలిన రొట్టెలతో మిల్క్ కేక్ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రుచికరమైన స్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెట్టిజన్స్ కూడా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఇది ఎలా పాజిబుల్ అంటున్నారు.
ఇదీ చదవండి: స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలిపితే సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు..
ఈ రిపిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మిగిలిన రొట్టెలతో మిల్క్ కేక్ తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిందల్లా వేడినూనె, మిగిలిన రొట్టెలు. ఈ వీడియో page@taste.thee.best పేజీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మిగిలిన రొట్టెలను ముందుగా వేడి వేడి నూనెలో పూరీల మాదిరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి క్రిస్పీగా మారతాయి వాటిని చిన్నగా విరిచి మిక్సీలో బరకగా గ్రైండ్ చేయాలి.
ఇదీ చదవండి: నోరూరించే మటన్ కట్లెట్ సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా..
ఇప్పుడు మరో ప్యాన్ స్టవ్ పై పెట్టి చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఇందులోనే పాలు కూడా కలపాలి. స్మూత్ పేస్ట్ తయారు అవుతుంది. అప్పుడు ఈ రొట్టె పిండిని కూడా అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్‌లో బట్టర్ పేపర్ వేసి ఈ మిక్చర్ అందులో పోసుకోవాలి. చల్లారిన తర్వాత మీకు కావాల్సిన ఆకృతిలో కట్ చేసుకోవాలి. అంతే మిల్క్ కేక్ రెడీ అయినట్లే..
దీనికి భిన్నాభిప్రాయాలు సోషల్ మిడియాలో వెల్లువెత్తున్నాయి. మిల్క్ కేక్ అని పేరు ఎందుకు పెడుతున్నారు. ఈ వింత వంటకానికి ఏదైనా పేరు పెట్టండి అని ఒకరు పోస్ట్ చేశారు.
కనిపెట్టాం బ్రో.. ఈ స్వీట్ పేరు పిండి హల్వా అని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.
మరొకరైతే ఇంత పని ఎందుకు సింపుల్ రొట్టెను చక్కెర వేసిన పాలలో నంజుకొని తింటే సరిపోతుంది కదా.. అని కామెంట్ పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి